సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆధ్వర్యంలో కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. తమ సామాజిక వర్గం స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని, ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులు రాష్ట్ర చట్టసభలో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. తమకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీగా లింగం నాయీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తరపున కవితను ఈ సందర్భంగా అభ్యర్థించారు. మూడు దశాబ్దాల నుంచి నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి లింగం నాయీ పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కూడా ఆయన తన వంతు కృషి చేశారని వెల్లడించారు. కవితను కలిసిన వారిలో ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు గోవింద్‌భక్ష మహేష్ చంద్ర, కోశాధికారి రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను వీరు కలిశారు. లింగం నాయీ పేరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్సీగా నామినేట్ చేసేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment