common
-
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్‌ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్‌లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
కట్లపాము.. అది చచ్చిన పామైనా జాగ్రత్తగా ఉండాలే..
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ సంచరిస్తుండటం సాధారణమే. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాముకాటుకు గురికాక తప్పదు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉంండాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అప్రమత్తంగా ఉండాలి పాము నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ ప్రవీణ్, పీహెచ్సీ వైద్యాధికారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
ట్యాక్స్ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే..
ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నాం. ఈ దశలో ట్యాక్స్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యమైన అంశం. చివరి నిమిషంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పన్ను ఆదా చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇలా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి సమర్థవంతమైన ట్యాక్స్ ప్లానింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. అవగాహన ముఖ్యం ప్రస్తుత ఖర్చులపై అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం పొరపాటు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. బీమా ప్రీమియం రూ.5 లక్షలు మించకూడదు ఏడాదికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో బీమా పాలసీలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఉండదని 2023 బడ్జెట్ స్పష్టం చేసింది. కాబట్టి పన్ను మినహాయింపుల కోసం బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టేవారు దానికి చెల్లించే ప్రీమియం ఏడాదికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! క్రెడిట్ కార్డ్ వినియోగంలో జాగ్రత్త! పన్ను మినహాయింపుల కోసమని కొంతమంది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోస్తుంటారు. ఇలా చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది అప్పులు పెరిగేందుకు దారితీయవచ్చు. ముందుగానే ప్లానింగ్ మంచిది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి ఆఖరు నెల వరకు ఆగకుండా ముందుగానే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ దాడులనుంచి రక్షణ, ఇతర సెక్యూరిటీ నిమిత్తం పాస్వర్డ్స్ చాలా కీలకం. సోషల్ మీడియా అకౌంట్స్ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు. అయినా నిర్లక్క్ష్యమే. బలహీనమైన లేదా సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, చాలా కీలకమైన ఫైనాన్షియల్ డేటాను కూడా హ్యాకర్లు ఈజీగా తస్కరించే అవకాశం ఉంది. ప్రతీ ఏడాది లాగానే 2022లో కూడా యూజర్లు చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తాజాగా సర్వేలో తేలింది. అందులోనూ భారతీయులు ఇంకా బలహీనమైన పాస్వర్డ్స్ఉపయోగిస్తున్నారని NordPass-2022 అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా ఏకంగా 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను మందికి పైగా భారతీయులు ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ‘‘పాస్వర్డ్" అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. భారతదేశంలో దాదాపు 3.5 లక్షల మంది సైన్ అప్ చేయడానికి పాస్‌వర్డ్‌గా “పాస్వర్డ్”ని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఇండియాతో దాదాపు 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. ఈ సంవత్సరం టాప్ 10 అత్యంత సాధారణ పాస్వర్డ్లు 123456, bigbasket, పాస్వర్డ్, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy. వీటితోపాటు గెస్ట్, వీఐపీ, 123456 లాంటి పాస్‌వర్డ్‌లను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది, పాస్వర్డ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ♦ వినియోగదారులు ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి, లేదంటే పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడం, హ్యాక్ చేయడం, యాక్సెస్ చేయడం హ్యాకర్‌కు ఈజీ అవుతుంది. ♦ పుట్టిన రోజులు, పెళ్లి రోజులను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకుండా ఉండటం మంచింది. (ఈజీగా గుర్తు ఉంటుందని దాదాపు అందరూ అలానే చేస్తారు) అలాగే అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్వర్డ్ కూర్చుకుంటే మంచిదని నిపుణుల సూచన. ♦ప్రతి నెలా పాస్‌వర్డ్‌ను అప్డేట్ చేయడం బెటర్. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం మంచి పద్ధతి. -
తెలియక ఈ తప్పులు చేశారో..బుక్కైపోతారు! బీ కేర్‌ఫుల్!!
ఒకప్పుడు తెలిసిన వారికే డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చేది. కానీ, నేడు చెల్లింపులన్నీ డిజిటల్ అయ్యాయి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. కూరగాయల దగ్గర్నుంచి ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. సినిమా, రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటళ్లలో బుకింగ్‌లు.. ఈ జాబితా చాలా పెద్దదే. కానీ, ఆన్లైన్ చెల్లింపుల్లో (యూపీఐ, ఇతరత్రా) ఎంత సౌకర్యం ఉందో, అంతకంటే ఎక్కువే రిస్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన, జాగ్రత్తలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి మోసపోతే కనుక దొంగ దొరికి, పోయిన మొత్తం వెనక్కి రావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను వివరించేదే ఈ కథనం. ►తెలియని వ్యక్తులతో లావాదేవీలు వద్దు ►తెలియని సంస్థలతోనూ ఇదే పాటించాలి ►యూపీఐకి బదులు , నెఫ్ట్, ఐఎంపీఎస్ మేలు ►ట్రూకాలర్ సాయం తీసుకోవచ్చు ►సామాజిక మాధ్యమాల తోడ్పాటు కూడా తీసుకోవాలి... ► పూర్తి నిర్ధారణ తర్వాతే చెల్లింపు అదేపనిగా కాల్స్ చేస్తే.. మోసగాళ్లు అయితే కాల్స్, మెస్సేజ్‌ల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. ఒకటికి నాలుగు సార్లు కాల్ చేయడం, ఎస్ఎంఎస్లు పంపిస్తుంటే ముందుగా అనుమానించాలి. వారితో మాట్లాడినప్పుడు ఈ ఆఫర్/అవకాశం మళ్లీ ఉండదని/రాదని చెప్పడం, వారి మాటల్లో ఏకరూపత లేకపోతే స్కామ్గానే సందేహించాలి. అలాగే, వాట్సాప్ చేస్తున్నా ఇలాగే అనుమానించాలి. కొందరు నేరస్థులు ఏ మాత్రం అనుమానం కలగనీయని రీతిలో సంప్రదింపులు చేస్తుంటారు. అటువంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కోరాలి. హోటల్ బుకింగ్ అయితే నేరుగా వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పాలి. మొదటగా తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫలానా ఆఫర్ అనో, ప్యాకేజీ అనో, లాటరీ వచ్చిందనో చెప్పే మాటలకు మెతకగా స్పందించడం, ఆసక్తి చూపడం, అయోమయంగా అనిపించేలా వ్యవహరించకండి. అవతలి వ్యక్తి మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని నంబర్, మెయిల్ ఐడీ నుంచి ఏదైనా ఆఫర్లు, సందేశాలు వస్తే, లింక్‌లు వస్తే వాటిని తెరవడం, అందులోని నంబర్లను సంప్రదించడం చేయవద్దు. పేరున్న సంస్థలు అయితే నేరుగా వాటి సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. అంతేకానీ, మొబైల్‌కు తెలియని మూలాల నుంచి ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే వెబ్‌లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాల్ చేసి, తమది ఫలానా ఎన్జీవో, చిన్న పిల్లల ఆరోగ్య అవసరాల కోసం విరాళాలు సమీకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇలాంటివి అసలు నమ్మనే వద్దు. ఎవరికైనా సాయం చేయాలంటే ప్రత్యక్షంగా చేయడమే మంచిది. అవసరం లేని ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం... రిస్క్‌ను ఆహ్వానించడమే. యూపీఐ వద్దు.. యూపీఐ చెల్లింపులకు బదులు నెఫ్ట్/ఐఎంపీఎస్ నగదు బదిలీ మార్గాలను అనుసరించడం కొంచెం సురక్షితమైనది. యూపీఐ సాధనం సురక్షితమైనదే. కానీ, సరైన వ్యక్తికి పంపినప్పుడే. నగదు స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు ఇందులో తెలియవు. అదే నెఫ్ట్/ఐఎంపీఎస్‌లో డబ్బు పంపాలంటే పూర్తి వివరాలు కావాల్సిందే. అందుకే అవతలి వ్యక్తి మాటలు నమ్మదగినవిగా అనిపించకపోతే, సందేహం వస్తే ఖాతా వివరాలు ఇవ్వాలని కోరాలి. కంగారు పడొద్దు... పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటే వేగం ప్రదర్శించొద్దు. సమయం తీసుకోండి. తొందరపడితే ప్రాథమిక అంశాలను కూడా విస్మరిస్తుంటాం. తొందరపడి మోస పోయినట్టుగా ఉంటుంది. అది నిజమా, మోసమా అని గుర్తించేందుకు వ్యవధి ఇవ్వాలి. అవతలి వ్యక్తితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడాలి. కొన్ని రోజులు ఆగి చూడాలి. అప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఆధారంగా నిజా, నిజాలను గుర్తించే వెసులుబాటు ఉంటుంది. ముందే మొత్తం వద్దు.. ఇక నగదు పంపించేందుకు సిద్ధమైతే కనుక మొత్తం ఒకేసారి చెల్లించేయవద్దు. సాధారణంగా నమ్మకం ఏర్పడినప్పుడు ఎక్కువమంది ఒకే విడత డిస్కౌంట్ కోరి చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాయిదాలుగా చెల్లించడం అందరికీ నచ్చదు. ఆన్లైన్ మోసాలను నివారించాలంటే.. ఒకేసారి మొత్తం పంపకుండా ఉండడమే మంచి మార్గం. దీనివల్ల మోసం అయితే కొద్ది మొత్తంతోనే ఆగిపోతుంది. గూగుల్ సెర్చ్.. డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్, ఈమెయిల్‌ను ఆన్లైన్లో ఓసారి సెర్చ్ చేయాలి. అదే నంబర్, అదే ఈ మెయిల్ పేరిట అప్పటికే ఎవరైనా మోసపోయి ఉంటే, ఆ వివరాలు లభిస్తాయి. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే.. అదే నంబర్ పలు వ్యాపారాలకు సంబంధించి చూపించొచ్చు. గూగుల్‌లో ఒకటికి మించిన కంపెనీలకు ఆ నెంబర్ చూపిస్తే కచ్చితంగా మోసపూరితమైనదే. ట్రూకాలర్ అయితే, అన్ని ఫోన్ నంబర్ల వివరాలు గూగుల్‌లో కనిపించాలని లేదు కదా? మోసగాళ్లు ఒక్కో పెద్ద మోసానికి ఒక్కో ఫోన్ నంబర్ వాడుతున్న రోజులు ఇవి. కనుక గూగుల్‌లో వివరాలు లభించకపోతే అప్పుడు ఫోన్లో ట్రూకాలర్ యాప్ వేసుకుని అందులో సెర్చ్ చేయడమే మార్గం. సదరు నెంబర్‌తో ఎవరైనా మోసపోయి ఉంటే.. ఫ్రాడ్, స్కామ్, స్పామ్‌గా చూపిస్తుంది. కచ్చితంగా దాన్ని ఒక సంకేతంగానే చూడాలి. పూర్తి పేరుతో వస్తే అప్పుడు తదుపరి పరిశీలనకు వెళ్లాలి. తెలియని పోర్టళ్లు.. తెలియని సంస్థల సేవలకు దూరంగా ఉండడమే భద్రతా పరంగా మంచి విధానం అవుతుంది. ఉదాహరణకు మూవీ టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే బుక్‌మైషో, పేటీఎం ఇలాంటివి అందరికీ తెలుసు. ఇవి నిజమైన వ్యాపార వేదికలు. కానీ, ఎప్పుడూ వినని వెబ్సైట్ లేదా యాప్‌లో ఒకటి కొంటే ఒకటి ఉచితానికి ఆశపడొద్దు. ఉచితమేమో కానీ, మన కార్డు వివరాలు, ఇతర కీలక సమాచారం పక్కదారి పట్టొచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాలన్స్‌ను కొట్టేయవచ్చు. వేరే వారికి స్టీరింగ్ టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దు. చేశారంటే మీ స్క్రీన్‌ను వారితో షేర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మీ తరఫున అవతలి వ్యక్తి లావాదేవీలు నిర్వహిస్తాడు. ఫోన్, కంప్యూటర్లోని సమాచారం మొత్తాన్ని కొట్టేస్తారు. ఇటీవలే గచ్చిబౌలిలో పనిచేసే 28 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఒక కాల్ వచ్చింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్రెడిట్ కార్డుకు ఇచ్చిన చిరునామా వివరాల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపాడు. ఇందుకోసం ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫోన్ చేసింది బ్యాంకు ఉద్యోగేనని నమ్మి, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాడు. అదే సమయంలో క్రెడిట్ కార్డు నుంచి రూ.52,000 డెబిట్ అయినట్టు సందేశం వచ్చింది. ఇంకేముంది కాల్ కట్. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆత్మ పరిశీలన ముందు చెప్పుకున్నట్టు కొంత సమయం తీసుకుని, మనలో మనమే ఓ సారి అన్ని అంశాలను బేరీజు వేసుకుని, కచ్చితత్వాన్ని రూఢీ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా ఉందని అనిపిస్తే.. ఇక ఆ డీల్‌కు అంతటితో ముగింపు పలకాలి. -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
ఆర్మూర్: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్‌కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్‌ను సృష్టించాలని వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
సంద్ర
సార్ పోస్ట్. పడకదిగి వెళ్లి పోస్ట్ తీసుకున్నా. ఎవరు రాశారు అని చూస్తే, టుడియర్ పోయెట్. ఫ్రమ్ సంద్రఏం రాసుంటుంది. అని తెరచి చూస్తే, మై డియర్ పోయెట్! కవిత్వం అంటే పారిపోయే నీవు ఎంత బాగా రాస్తున్నావ్. ఎప్పుడూ అకడమిక్ పుస్తకాలు దాటి చూడని నీవు, ఈమధ్య లేఖలో రాసే ప్రతి వాక్యంలో వచనమే రాస్తున్నావ్. క్రితంసారి నువ్ రాసిన లేఖ ముగింపుని ఎన్నిసార్లు చదువుకున్నానో. బాగా నచ్చిందోయ్. నిజంగా! ఒక్కమాట చెప్పనా, నాకన్నా బాగా రాస్తున్నావ్. ప్రౌడ్ ఆఫ్ యు స్టుపిడ్. నా రీసెర్చ్ మొత్తానికి అయిపోయింది. అది అయిపోగానే నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఒకటే ఆత్రం. ఈ ఐదేండ్ల ఎడబాటును చెరిపేస్తూ నీ దరికి వస్తున్న.బోలెడంత ప్రేమతో సంద్ర అచంచలమైన ప్రేమను లేఖల్లో వ్యక్తపరచే తను, ఐదేండ్ల తరువాత కళ్లముందుకు వస్తున్నట్టు రాసింది. ఎప్పుడు వస్తుంది? మళ్ళీ చదివా. తారీఖు చూస్తే రేపే వస్తున్నట్టుంది. తన జ్ఞాపకాల్లో కాలం గడిచిపోయింది. గడచిన కాలమంతా ఒకవైపు. ఆమెతో కలసి నడచిన కాలం ఒకవైపు. స్వేచ్ఛగా ఉండటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తనని చూపిస్తే సరిపోతుందేమో. తన స్వేచ్ఛను ప్రకటించి పోయిన తను, ఎప్పటిలాగే ఉత్తరమై పలకరించింది. ఈసారి ఎడబాటును ఓపమని గాక ఎడబాటును చెరిపెయ్య వస్తున్నట్టు.ఇప్పుడంటే ఇట్లా రాస్తున్నాను గానీ తన పరిచయం లేకముందు ఎంత ముభావంగా ఉండేవాడ్నో తలచుకుంటే నవ్వొస్తుంది. ఎంత అందమైనవి తన తలపులు. కేవలం అందమైనవేనా? అద్భుతమైనవి. ఎట్లా వచ్చింది తను జీవితంలోకి. గుడ్లగూబ కళ్ళది. ఇంతింత కళ్లేసుకొని. ఏంటి ఈ పిల్ల ఇట్లా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంది అనుకునేవాణ్ణి. ఓ రోజు యూనివర్సిటీలో నడుస్తూ ఉంటే వెనకనుండి నెత్తిపై మొట్టి, వెనక్కి తిరగగానే కౌగిలించుకుంది. ‘ఏంట్రా ఈ మధ్య కనపడట్లేదు’ అని అత్యంత సహజంగా అడిగింది. ఏంటి ఈ పిల్ల పరిచయమై నాలుగు రోజులన్నా కాలేదు.. ఏదో ఏండ్ల నుండి సావాసం ఉన్నట్లు మాట్లాడుతుంది. నడిరోడ్డుపై కావలించుకుంటుంది. ఈలోకంతో పట్టింపులేనట్లు. ఏదో ఓ సందర్భంలో కలవడం, మాట్లాడటం దినచర్యలాగానే అయిపోయింది. ఓ రోజు తన స్నేహితురాలి ఇంటికి పోవాలి రా అని పిలిచింది. వెళ్లి వాళ్ళింట్లో కూర్చోని మాట్లాడుతుంటే ఓ ముసలమ్మ వచ్చి మా ఇద్దరిని పరీక్షగా చూసి ఎదురుగా కూర్చుంది. ‘ఓయ్ అమ్మాయ్, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఆ ప్యాంటు, షర్టు వేసుకుని రాకపోతే ఎంచక్కా లంగా, ఓణిలో రావచ్చు కదా!’‘రాకూడదని ఏమి లేదు బామ్మా! లంగా ఓణిలో బండిపై ఆటోకాలు, ఇటోకాలు వేసుకొని కూర్చోవడం కాదు అనే వేసుకోట్లేదు. ఈ ప్యాంటు, షర్టు కన్నా కూడా చిన్న చిన్న నిక్కర్లు బాగా సౌకర్యంగా ఉంటాయి. వచ్చేసారి అవి వేసుకొని వస్తాలే’ఈ పిల్ల అన్న మాటలకు ముసలామే ఊకుంటదేమో అనుకున్నా. అంతలోనే అడిగింది – ‘అవును అమ్మాయ్ ఇంతకీ మీరేంటి?’‘మీరేంటి అంటే ఈ దేశంలో, మీదే కులమనేగా? అదేనా బామ్మ నువ్వు అడుగుతోంది?’‘– అవుననుకో’‘నాకు ఒక కులమంటూ లేదు. అయ్యదో కులం. అమ్మదో కులం. ఇక మతమంటావా! నాన్న కొద్దిగా భక్తుడు. అమ్మకు ఏ నమ్మకాలూ లేవు.’‘అంటే దేవుడ్ని కూడా నమ్మదా ఏంటి?’‘ఉంటే కదా బామ్మ నమ్మడానికి.’ ‘ఏందో అమ్మా! బొత్తిగా ఈ కాలం పిల్లలకు భయము, భక్తి లేకుండా పోతోంది.’ అంటూ వెళ్ళిపోయింది. ఉదయాన్నే లేవగానే తన నుండి ఫోన్. అర్జంట్‌గా హాస్టల్‌కి రమ్మని. వెళ్లి వేచి చూస్తుంటే మెల్లిగా వచ్చింది. మోకాళ్ళపైకి షార్ట్, క్రాప్డ్ టాప్‌తో. జనాల కళ్ళన్నీ తన కాళ్ళ మీదే. వచ్చి బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి, పెన్ను ఉందా అని అడిగి ఏదో రాసిచ్చింది. రూముకెళ్లేదాకా పుస్తకం చూడొద్దని బాసతీసుకుని మరీ. రూముకెళ్లి ప్రాజెక్ట్ వర్క్ రాస్తుండగా ఫోన్ చేసింది. ‘రేయ్ ఇంతకీ చదివావా.. లేదా..’ అని. అప్పటికి గానీ గుర్తుకురాలేదు. తను పుస్తకంలో రాసిన సంగతి. ‘లేదు. ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్నా. చదువుతా’ అన్నా. ‘నువ్వు, నీ ప్రాజెక్టు వర్కులు.. ఇవేగాక జీవితంలో చెయ్యాల్సినవి చాలా ఉన్నాయిరా బాబు. ముందు అది చదివి కాల్ చెయ్’అప్పుడు తెరిచా పుస్తకాన్ని, తనేం రాసిందో చదవడానికి. ‘మై డియరెస్ట్.నా ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు, నా భావాల్ని చెప్పేందుకు సరిపోయే నా ప్రియకవి పాబ్లో కవితని పంపుతున్నా. కవితలో ప్రతి పదం, ప్రతీ పాదం నీపై నా అనుభూతే. నీది సహానుభూతి కావాలని ఆశిస్తూ. నీ సమాధానంకై వేచి చూస్తూ.’ అంటూ ఓ కవిత పంపింది. తను రాసింది చదవగానే కాల్ చేశా. ‘ఏంట్రా చదివావా?’‘– చదివాను. నువ్ ఏదో ఇష్టాన్ని చెప్పాలని రాశావ్. ఆ కవిత సరిగా అర్థం కాలేదు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ, ఇంతకీ అనుభూతి, సహానుభూతి కావడం అంటే ఏంటి?’‘ఒసెయ్, పిచ్చిమొద్దు. అంతలా నీకోసం రాస్తే అర్థం కాలేదు అంటావేంట్రా!’‘– నిజంగా అర్థం కాలేదు.’‘అది ప్రేమలేఖరా బాబు.. నిన్ను ప్రేమిస్తున్నానని లేఖ రాశా.’ ఊహించని పరిణామానికి నా వైపు నుండి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ, ‘రేయ్ నాకు అనిపించింది చెప్పిన, నీకు ఏమనిపిస్తే అది చెప్పు.’ అని ఫోన్ పెట్టేసింది. మర్నాడు యూనివర్సిటీలో కలిసింది. ఏమీ జరగనట్టే, ఏమీ ఎరగనట్టే అత్యంత సహజంగా, ఎప్పటిలాగే పలకరించింది. కాసేపు అలా దిక్కులు చూస్తూ, మధ్య మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తూ మాట్లాడుకున్నాం. మాటల్లో మాటగా, ‘అవును. నిన్న లేఖ ఎందుకు రాశావ్?’ అని ఆడిగేశా.‘ఎందుకు రాశానో నిన్ననే చెప్పాను కదా’ ఒక్కటే సమాధానం. ‘అసలు ఎందుకు రాశావ్?’ మరో ప్రశ్న.‘అదికూడా నిన్ననే చెప్పినా కదా?’ మళ్ళీ అదే సమాధానం.‘అదే ఎందుకు?’ ‘పైకి ఇలా ముద్దపప్పులా కనిపిస్తావ్ గానీ, నీకు సమాజం పట్ల మంచి కన్సర్న్ ఉంది.’ ‘అయితే ప్రేమిస్తారా?’‘నాపట్ల కూడా అంతే కన్సర్న్ ఉంది. అందుకు ప్రేమించా.’‘నీకెలా తెలుసు?’‘వేసుకున్న బట్ట కాస్త పక్కకి తొలగితేనే, చూపులు తిప్పుకోని జనాలున్న చోట, నువ్వెప్పుడూ ఏ అమ్మాయినీ అట్లా చూడలేదు. అంతెందుకు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకు తిరిగే నన్ను, నాలాగే చూశావ్. నీ దోస్తులంతా, నా బట్టల్ని కామెంట్ చేస్తుంటే నువ్వు వాళ్లను మందలించావు. నచ్చేశావ్. పైకి కనిపించే ముద్దపప్పువేం కాదు అనిపించింది అప్పుడు.’‘సంద్ర ఒక మాట చెప్పనా? నీలాంటి ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయితో కలిసి బతకాలంటే నేనూ నీలాగే ఉండాలి. నేను కాస్త రిజర్వ్డ్. నువ్వేమో అలా కాదు. కలిసిన వెంటనే కలిసిపోతావ్. నాలుగు రోజుల్లోనే ఆ మనిషిపై ఒక అంచనాకి వస్తావ్. ఇదిగో ఇలా కలిసి నెల రోజులన్నా కాలేదు ప్రపోజ్ చేశావ్. నేను ఇలాగే ఉంటాను. నీలాగ ఉండలేను.’ ఓరే ముద్దపప్పు, నువ్వు నీలాగ ఉన్నావు కాబట్టే నచ్చావ్. నాలాగా ఉండాలనే, మారాలనే స్వార్ధమేమీ లేదు నాకు. అయినా నువ్వు నీలాగే, నేను నాలాగే ఉంటూ, ఇద్దరం ఒక్కటిగా ఉండటం ఎంత బావుంటుంది? నువ్వు నన్ను నీలా మారమని కాకుండా, నాలా ఉండలేనని అంటున్నావ్ చూడు అందుకు ఇంకా నచ్చావ్. నువ్వు నీలాగే ఉండు. నన్ను నాలాగే ఉండనివ్వు. నీకు ఇష్టముంటే, నేను ఇంకొకడిని చూసుకోక ముందే చెప్పు.’‘అంటే నాకోసం, నా జవాబు కోసం ఎదురుచూడవా?’‘ఈ ఎదురుచూపులు, నువ్వు కాదన్నావని కన్నీరు మున్నీరై విలపించడాలు సినిమాల్లో బాగుంటాయి. నా వంటి వాడికి పడవు. నువ్వు నచ్చావని నేను స్వేచ్ఛగా చెప్పినపుడు. నీకు నచ్చలేదనో, ఇంకేదో చెప్పే స్వేచ్ఛ నీకుంది. సరే నేను మీటింగ్‌కు పోవాలి. కలుస్తా.’ కాలం ఎవరి కోసం ఆగదు కదా. కాలం ఒక జీవనది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటిలాగే రూంకి వచ్చిన సంద్ర, ‘రేయ్ నాకు సముద్రం చూడాలని ఉంది!’ అంది. ‘సరే, ప్లాన్ చేద్దాంలే!’ అని నేనంటే వినిపించుకోలేదు. అప్పటికప్పుడు గోవాకు రెండు టికెట్లు బుక్ చేసింది.æబీచ్‌కి వెళ్ళగానే తీరంలో కూర్చొని తదేకంగా సముద్రం వంక చూస్తోంది. ‘అంతలా ఏం చూస్తున్నావ్ సంద్ర?’ అనడిగా. ‘ఎగిసిపడే అలల్ని. తీరం తాకి, వెనక్కి మళ్లే అలల్ని. అలలు సముద్రంలోకి పోతున్నప్పుడు జాలువారే ఇసుకని. అదుగో దూరంగా నేల, ఆకాశాన్ని కలుపుతున్నట్టు ఉన్న దృశ్యాన్ని. ప్రశాంతంగా అలలు చేసే శబ్దాన్ని విను. ఏ సంగీతకారుడు పలికించగలడు దీన్ని?’‘సముద్రం అంటే అబ్సెషన్ ఎందుకు సంద్ర?’ ‘నేనే సముద్రం కాబట్టి,’ నవ్వింది.‘అవునూ ఇంతకీ సంద్ర అంటే అర్థం ఏమిటి?’ ‘సంద్ర అనే పేరు ఉందో, లేదో తెలియదు. అమ్మకి సముద్రం అంటే ఇష్టం. అందుకే సముద్రాన్ని షార్ట్‌గా చేసి, సంద్ర అని పెట్టుకుంది. నాకు సముద్రాన్ని చూడటం అమ్మతోనే అలవాటయింది. నాన్న దూరమయ్యాక ఇద్దరం ఇలా సముద్రతీరంలో గంటలు, గంటలు, రోజులు, రోజులు గడిపేవాళ్ళం. అమ్మ లేకుండా సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి.’ అంటూ భుజంపై తలవాల్చింది. ఎప్పుడూ పైకి ప్రశాంతంగా కనిపించే సంద్రలో ఇంత విషాదమూ ఉందా. అయినా బయట పడదేంటి. ఏమో ఈ పిల్ల అర్థం కాదు. అర్థమయినట్టే అనిపించే అర్థంకాని పిల్ల. సూర్యుడు సముద్రంలోకి మాయమయ్యే దృశ్యాన్ని చూపిస్తూ, మెడపై చేతులు వేసి కావలించుకుంది. పొద్దటినుండి అలసిపోయి బెడ్‌పై పడుకోగానే, వచ్చి పక్కన పడుకుంది. మాటల్లో కాసింత కాలం గడిచిపోయింది. కాసేపు మాటల్లేని యుద్ధం. తొలికలయికలో కార్చిన కన్నీళ్లను తను దాచాలనుకున్నా, చెదిరిన కాటుక తన కన్నీళ్లకు సాక్షం చెప్పింది. కాసేపు కిటికీలోంచి బయటకు చూసి, ఏదో రాసుకుంది. పొద్దున లేచేవరకు చుట్టూ చేతులు వేసి అల్లుకొని పడుకుంది. మెల్లిగా పక్కకు జరిపి పడకదిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని చూస్తుంటే, దూరంగా సూర్యోదయం. పక్కనే రాత్రి తను రాసిన పుస్తకం. తెరచి చూశా. ‘కిటికీలోంచి బయటకి చూస్తే, చూపుకు దగ్గరగా, అయినా అందుకోలేనంత దూరంగా సముద్రం. తీరాన్ని తాకుతూ అలలు. అనిర్వచనీయ ప్రేమను వ్యక్తికరించిన క్షణాలు. గుర్తుకురాగానే ఎరుపెక్కిన బుగ్గలు. వాన్నలా చూస్తుంటే మళ్ళీ ఓసారి ఊపిరి ఆపేసినంత పనిచేసి ఊపిరి పోయాలనిపిస్తుంది.’ చదివాక ఏదో చెప్పలేని అనుభూతి. మళ్ళీ పడుకున్నా. ఓరోజు హడావుడిగా రూంకి వచ్చి, ‘రేయ్ నాకు ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వచ్చింది. ఇంకో పది రోజుల్లో ప్రయాణం..’ అంది. ‘వాట్? అంటే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా?’ ‘నీకు తెలుసుకదా నాకు అక్కడ చదవడం కల అని. అయినా నేనేం నిన్ను వదిలేసి పోవట్లేదు. రీసెర్చ్ కోసం పోతున్నా. మళ్ళీ వస్తా కదా.’ ‘ఊహు, వెళ్లడం మానెయ్. ఇక్కడే రీసెర్చ్ చేద్దాం.’ ‘సారీ డార్లింగ్, నో కాంప్రమైజ్ ఆన్ మై డ్రీమ్. అయినా నీకు ముందే చెప్పా కదా. కొత్తగా ఇదేంటి. డోంట్ బి పోసేసివ్.’ ‘అదంతా నాకు తెలియదు. కాంట్ లివ్ వితౌట్ యు.’ ‘డోంట్ బి స్టుపిడ్. ఒక్క ఫైవ్ ఇయర్సే కదా.’అంతే. సంద్ర ఫిక్స్ అయితే ఎవ్వరి మాటా వినదు. ‘నీ ఇష్టమైనప్పుడు రా. అంతవరకు, అంతే ప్రేమతో ఎదురుచూస్తుంటా’ అన్నా. మాట్లాడటం అయిపోగానే గట్టిగా హత్తుకుంది. అప్పుడు కలిసిన తను. ఆ తర్వాత నుండి మెయిల్ కాలంలో కూడా ఉత్తరమై పలకరిస్తూనే ఉంది. ఎప్పుడు రాసినా ఏదో కొత్త విషయం. ఏదో తెలియని ఉత్సుకత ఉంటుంది తన ఉత్తరాలలో. మళ్ళీ మళ్ళీ చదివించేలా రాస్తుంది. ఎప్పుడు చదివినా అదే కొత్తదనం. ఎట్లా అబ్బింది తనకు ఇట్లా రాయడం. బహుశా బాగా చదవడం వల్లేమో. తను వస్తుందనే విషయం ఒక్కచోట కాలు నిలవనివ్వడం లేదు. సంద్ర. తిరిగొస్తోంది. నాకోసం వస్తోంది.డోర్ బెల్ మోగిన మోత. ఇప్పుడెవరో అనుకుని ఒక నడక, చేతిలోని ఉత్తరం బల్లపై పెట్టి, తలపులనుండి బయటపడి తలుపు వైపు. -
ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఆమోదించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌కు వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 16 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు లేకపోవడంతో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోయి ఎంఈఓ, డీవైఈఓ, డైట్, జూనియర్కళాశాలల లెక్చరర్ పోస్టులు భర్తీ కావడంలేదన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని, ఎయిడెడ్, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లకు వెంటనే హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ ఉన్నారు. -
ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్టీయూ నాయకులు బుధవారం ఢీల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉన్నందున వెంటనే ప్రతి పాదనలను రాష్ట్రపతికి పంపించి ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి పాత విధానం అమలు చేయాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, కె. జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలి
– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర మహాసభలలో సామాజిక, విద్యారంగ అంశాలపై చర్చిస్తామని, జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబాటుపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని అన్నారు. మహాసభలు మహబూబ్‌నగర్‌లో డిసెంబర్ నెలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్‌గా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా ఎన్.వెంకటేష్, టీఎస్‌యూటీఎఫ్ పూర్వనాయకులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్యలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట!
లండన్: మిగతావారితో పోల్చితే ప్రజ్ఞావంతులు అన్ని విషయాల్లో ముందుంటారు. వారికున్నటువంటి ఎక్కువ ఐక్యూ మూలంగా అన్ని వ్యవహారాల్లో దూసుకుపోతుంటారన్నది తెలిసిందే. అయితే ప్రజ్ఞావంతుల్లో కామన్‌గా ఉండే అంశం ఏంటన్నదానిపై జరిగిన పరిశీలనలో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. అదేంటంటే.. వీరు మిగతావారితో పోల్చితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో వెల్లడైన ఈ విషయాన్ని 'స్టడీ మేగజైన్'లో ప్రచురించారు. మనుషుల్లో ఉండే ఐక్యూ యావరేజ్ అనేది వారు రాత్రి పూట ఎంత త్వరగా నిద్రపోతున్నారనే అంశాన్ని ప్రభావితం చేస్తోందని దీనిలో వెల్లడించారు. మరి నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు విధి నిర్వహనలో భాగంగా మెలకువతో ఉంటారు కదా.. అలా అని వారికి ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లా అని అడుగుతున్నారు కొందరు. అయితే.. రాత్రిపూట మొత్తం పార్టీల్లో గడిపేసి పగలు నిద్రపోయే రాత్రిజీవుల్ని సపోర్ట్ చేసేలా ఉన్న ఈ ఫలితాలను అనుకరించాలని ప్రయత్నించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని సలహా ఇస్తున్నారు ఇంకొందరు. -
బడ్జెట్లో సామాన్యులను పట్టించుకోలేదు
పార్టమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పెదవి విరిచారు. ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఎటువంటి ఉపశమనం లేదని అన్నారు. ఎట్టకేలకు పారిశ్రామికవేత్తలకు కాస్త ఉపశమనం కలిగేలా చూశారని చిరకాలంగా ఉన్న రైతుల రుణమాఫీ డిమాండ్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగేందుకు ఏమాత్రం ఉపయోగపడిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధి హామీకి 40,000 కోట్లు ఇచ్చిందన్నారు. దాంతో పోలిస్తే ఈ బడ్జెట్ పెద్ద విషయమేమీ కాదన్నారు. మొత్తం కేటాయింపులు ఎంత పెరిగాయన్నది ముఖ్యం కాదని, వేతనాల్లో ఎంత పెరిగిందన్నది పోల్చి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజుకూలి 100 రూపాయలు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం 40 వేల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోజు కూలి 150కి మారిందని అన్నారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఒక్క డబ్బు విషయాన్నే పరిగణలోకి తీసుకుందని, భౌతిక భాగాన్ని పరిశీలించలేదని ఖర్గే విమర్శించారు. ముఖ్యంగా బడ్జెట్లో మహిళలు, యువతకు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదంటూ ఆరుణ్ జైట్లీ బడ్జెట్ పై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు. -
రామరాజ్యంలోనూ రేప్‌లు జరిగాయన్న డీజీపీ!
లక్నో: రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయట.. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ అట.. వాటిని నిరోధించడం ఎవరివల్లా కాదట.. చివరికి పోలీసుల వల్లా కాదంటూ చెత్తులెత్తేసిన పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ. ఉత్తరప్రదేశ్ డీజీపీ జగ్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. త్వరలో రిటైర్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ అసహనంగా స్పందించారు. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. అత్యాచారాలు చాలా సాధారణమని, రామరాజ్యంలో కూడా రేప్‌లు జరిగాయంటూ వివాదాస్పదంగా మాట్లాడి సంచలనం రేపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల గురించి మీడియా ప్రశ్నించినపుడు.. ''మహిళలపై అఘాయిత్యాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. రామరాజ్యంలో కూడా రేప్ లు జరిగాయి'' అంటూ మీడియాపై ఎగిరిపడ్డారు. దీనిపై మరింత వివరణ కోరిన జర్నలిస్టుతో 'నన్ను ప్రైవేట్ గా కలువు, అప్పుడు దీనికి జవాబు చెబుతా' అన్నారు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు కూడా పూర్తిగా అరికట్టలేరంటూ తేల్చి పారేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ వివాదాస్పదంగా స్పందించడంపై పలువురు మండిపడుతున్నారు. డీజీపీ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు. -
'రాబిన్ హుడ్' ఆకలిపై పోరాటం!
పారబోసేది వారబోయమన్నారు పెద్దలు... మనకు ఎక్కువై బయట పడేసేది మరొకరి కడుపు నింపుతుందని వారి నమ్మకం. అదే విషయాన్ని అక్షరాలా పాటిస్తున్నారు ఆ యువ సైన్యం. భారత, పాకిస్తాన్ దేశాలను వెంటాడుతున్న ఆకలిపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాబిన్ హుడ్స్ పేరిట ఆరుగురు యువకులు ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఎన్నో పట్టణాల్లో తమ సేవలను విస్తరించి... ఆకలితో పోరాడే శక్తివంతమైన ఆయుధాలుగా మారారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు యువకులు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబిన్ హుడ్ పేరిట ప్రారంభమైన వారి సేవా కార్యక్రమం..ఆపారంగా వ్యర్థమౌతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడమే. విందు సమయాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో అలమటించేవారికి పంపిణీ చేయడం పరమావధిగా ఎంచుకున్నారు. ఒక్క ఇండియాలోనే కాక, తమ సేవలను పాకిస్తాన్ పట్టణాలకూ వ్యాపింపజేసిన ఆర్ హెచ్ ఏ ప్రస్తుతం వెయ్యిమంది వాలంటీర్లతో 18 నగరాల్లో విస్తరించి సుమారు రెండున్నర లక్షలమంది ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారాన్ని అందిస్తోంది. పోర్చుగల్ రెస్టారెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్ననీల్... అప్పట్లో తమ వద్దకు వచ్చిన రీ ఫుడ్ సంస్థ సభ్యులను చూసి ఎంతో స్ఫూర్తిని పొందాడు. సంస్థ సభ్యులు రెస్టారెంట్ లోని ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి అందించడం నీల్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి సేవలను ఇండియాలో ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాడు. ఢిల్లీకి వచ్చిన అనంతరం తన స్నేహితులకు వివరించాడు. ఇంచుమించుగా 'రీఫుడ్' మాదిరిగానే తమ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు నగరాల్లోని రెస్టారెంట్లు, వెడ్డింగ్ కాటరర్లకు తమ కార్యక్రమాన్ని వివరించిన 'ఆర్ హెచ్ ఏ' సభ్యులు.. వారి వద్దనుంచీ మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, ప్యాకెట్లుగా తయారు చేసి పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే వాలంటీర్లంతా ఉద్యోగస్థులు కావడంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా వారాంతాల్లో చేయడం కొనసాగిస్తున్నారు. 2014 లో నీల్, ఆనంద్ ల బృందం.. సుమారు 150 మందికి ఆహారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే నేడు సుమారు వెయ్యిమంది వాలంటీర్లతో రాబిన్ హుడ్... పలు పట్టణాల్లో లక్షల మందికి ఆహారం పంపిణీ చేస్తోంది. రాబిన్ హుడ్ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆహార పంపిణీ అయినా... పలు ఇతర సేవలను కూడ అందిస్తోంది. చలికాలంలో ఢిల్లీలోని నిరుపేదలు, అనాధలకు దుప్పట్లు వంటివి అందిస్తోంది. ప్రస్తుతం పలు విభాగాలుగా ఏర్పడిన రాబిన్ హుడ్... ఒక్క ఢిల్లీలోనే ఏడు ఛాప్టర్లు పని చేస్తుండగా... ముంబైలో తొమ్మిది, ఇతర పట్టణాల్లో పలు విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రతి విభాగంలోనూ సభ్యులంతా ఆ ఛాప్టర్ హెడ్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వీరంతా ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. 'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు పెరగడంలో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ బృందంలో సేవలందించేందుకు ఎటువంటి ప్రత్యేక నిబంధనలు లేవని, అయితే రెండు విషయాలను మాత్రం సేవకులు దృష్టిలో ఉంచుకోవాలని గ్రూప్ ప్రారంభ నిర్వాహకుడు నీల్ అంటున్నారు. వాటిలో ఒకటి ఎవరిదగ్గరా, ఎటువంటి ఫండ్స్ వసూలు చేయకూడదని, తయారు చేసి, ఆరుగంటలకు మించిన ఆహారం సేకరించకూడదని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే కాక, పాకిస్తాన్ లోని నాలుగు నగరాల్లో 'ఆర్ హెచ్ ఏ' సేవలు అందిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన నీల్ స్నేహితురాలు తారా పాకిస్తాన్ లో సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం రెండు దేశాల్లోనూ 'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు 23 నుంచి 30 మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. అత్యంత ఉత్సాహభరితంగా ఉన్న కొందరు 50 ఏళ్ళ వయస్కులు కూడ ఉండగా... కోల్ కతాలో ఐదేళ్ళ అత్యంత చిన్న వయసు బాలుడు కూడ ప్రత్యేక సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం నీల్, ఆనంద్ లు ఇరు దేశాల్లో పాఠశాలల్లో కూడ తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సేవలతో ఆకలి సమస్య కొంతవరకైనా తీరాలని తాపత్రయ పడుతున్నారు. -
అగ్రిగోల్డ్‌పై 9వ తేదీ హైకోర్టు ఉత్తర్వులు
-
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట
-
బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్
స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్న సామాన్యుడు సెటిల్మెంట్ల పేరుతో వసూళ్లు పాత నేరస్తులను పిలిచి మామూళ్లు దండుకుంటున్న సిబ్బంది గుడివాడ : గుడివాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యుడు భయపడుతున్నాడు. మామూళ్లు ముట్టజెప్పిన వారికే న్యాయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ద్వితీయశ్రేణి అధికారి అన్నీ తానే చక్రం తిప్పుతున్నాడు. పై అధికారులకు ఇవ్వాలంటూ ఫిర్యాదుదారుల నుంచి ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టేషన్ పరిధిలో ఎక్కువగా మురికి వాడలే ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, మంచినీటి ట్యాపుల వద్ద గొడవలు ఎక్కువుగా వస్తుంటాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయటానికి వస్తే రెండో వారిని పిలిచి ప్రత్యర్థులపై ఎలా కేసులు పెట్టాలో ఇక్కడ సిబ్బంది సలహాలు ఇస్తారని, చివరికి ఇద్దరినీ పిలిచి సెటిల్మెంట్లు చేసి డబ్బుదండుకుని పంపుతారని పలువురు ఆరోపిస్తున్నారు. పేకాట శిబిరాలపై వేరే ప్రాంతం పోలీసుల దాడి స్టేషన్ పరిధిలో పెద్దఎత్తున జూదాలు జరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ వీరికి తెలియకుండా రెండుసార్లు పెడన పోలీసు సిబ్బందితో దాడులు చేయించి పెద్దమొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పిలిచి చీవాట్లు పెట్టినట్లు వినికిడి. పాత నేరస్థులకు వేధింపులు స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులను పిలిచి స్టేట్మెంట్లు రికార్డు చేయాలని జిల్లా ఎస్పీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదునుగా భావించిన స్టేషన్ సిబ్బంది పాత నేరస్తులను పిలిచి భారీగా డబ్బులు వసూలు చేసి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు స్పందించి స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సామాన్యునికి - పాస్‌పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా!
సి.బి. ముత్తమ్మ... మనదేశంలో మొదటి మహిళా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్). ఆమె 1949లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరోసారి వచ్చింది. ఆ అవసరాన్ని కల్పించిన మహిళ అశ్విని సత్తారు. అశ్విని కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఒక తొలి రికార్డును కూడా సాధించారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసులో రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్. అంతేకాదు... పాస్‌పోర్టు ఆఫీస్ చరిత్రలో తొలి మహిళా అధికారి. సామాన్యులకు పాస్‌పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన తొలి అజెండా అంటున్న అశ్విని సత్తారుతో ముఖాముఖి. మీరు మీడియాకు దూరంగా ఉంటారనుకుంటాను. అపాయింట్మెంట్ చాలా కష్టమైంది... అశ్విని: నిజమే. పెద్దగా ఇష్టపడను. ఏ బ్యాచ్‌లో ఐఎఫ్ఎస్లోకి వచ్చారు? అశ్విని: 2008 బ్యాచ్. నాన్న ఐపిఎస్, మీరు ఐఎఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. కానీ ఐఎఫ్ఎస్ను ఎంచుకోవడంలో కారణం ఉందా? అశ్విని: డిప్లమాట్ అవుదామనే ఐఎఫ్ఎస్ని ఎంచుకున్నాను. ఇండియా చాలా గొప్ప దేశం. ఈ దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు? అశ్విని: ఒకరు ప్రభావితం చేయడం అనడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉండేది. నాన్నగారు ఈ రంగంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. కాలేజ్కొచ్చే సరికి అది ఐఎఫ్ఎస్ అని స్పష్టంగా నిర్ణయించుకున్నాను. మీ వికాసంలో అమ్మానాన్నల్లో ఎవరి పాత్ర ఎక్కువ? అశ్విని: నాకు తెలిసినంత వరకు పిల్లల వికాసంలో అమ్మపాత్ర, నాన్న పాత్ర అని విడదీసి చూడలేం. అమ్మానాన్న ఇద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ పిల్లల్ని నడిపిస్తుంది, నడవనిస్తుంది. మా అమ్మానాన్నలు నన్ను, మా అన్నయ్యను ఇద్దరినీ నడవనిచ్చారు. మాకు ఇష్టమైన రంగాల్లోకి రావడానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. అన్నయ్య జాన్సన్ అండ్ జాన్సన్స్లో సౌత్ ఇండియా హెడ్. మీ బాల్యం ఎక్కడ గడిచింది? అశ్విని: మొత్తం హైదరాబాద్‌లోనే. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదివాను. ఉస్మానియా యూనివర్శిటీలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్? అశ్విని: గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ దాదాపుగా ఒకే రూపు సంతరించుకున్నాయి. రెండు - మూడ దశాబ్దాల కిందట అయితే ఎవరైనా యుఎస్ నుంచి వస్తుంటే అక్కడి విశేషాలను తెలుసుకోవడం కోసం బంధువులు, స్నేహితులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. నేను వెళ్లినప్పటికి అలా కొత్త భావన కలిగే పరిస్థితి లేదు. సివిల్స్ ప్రిపరేషన్లో జర్మన్ లాంగ్వేజ్ తీసుకున్నాను. కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకపోయింది. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీలో మీ అనుభవాలు? అశ్విని: ఐఎఫ్ఎస్గా నా మొదటి పోస్టింగ్ జర్మనీలోనే. 2010వ సంవత్సరం జూలై నుంచి 2013 వరకు బెర్లిన్‌లోని భారత రాయభార కార్యాలయంలో పని చేశాను. మనదేశానికి- జర్మనీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను అక్కడ ఉన్న సమయంలోనే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దఫాలు జర్మనీలో పర్యటించారు. మనదేశానికి సాంకేతిక సహాయకారి జర్మనీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జర్మనీ ముద్ర మన దేశం మీద చాలా ఎక్కువ. మనం ఉపయోగించే ఎస్కలేటర్, లిఫ్ట్, కార్లు, పెద్ద మెషీన్లు... ఇలా అనేకం జర్మనీ తయారు చేసినవే. జర్మనీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే అని చెప్పాలి. జర్మనీ నుంచి మనదేశం నేర్చుకోవాల్సింది... అశ్విని: చాలా ఉంది. వారిలో జాతీయభావన మెండు. ఉద్యోగం కూడా దేశం అభ్యున్నతి కోసమే అన్నట్లు చేస్తారు. పని కచ్చితంగా చేయడం ద్వారా దేశాభివృద్ధిలో తమ పాత్రను నిర్వహిస్తున్నాం అని సంతోషిస్తారు. మేధాసంపత్తిలో భారతీయులు చాలా తెలివైన వాళ్లు. వర్క్ కల్చర్, క్రమశిక్షణ, జాతీయత భావాన్ని పెంచుకుంటే మనదేశం త్వరగా అభివృద్ధి చెందుతుందనిపించింది. పాస్‌పోర్టు వ్యవహారాల విషయానికి వస్తే... తొలి మహిళా అధికారిగా ఎలా ఫీలవుతున్నారు? అశ్విని: ప్రొఫెషన్‌కి స్త్రీ, పురుషులనే తేడాలుండవు. అయితే ఒక విషయాన్ని మహిళలు స్వీకరించే విధానం కొంత భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా పరిమితమైన సందర్భాల్లోనే. నాకు తేడా ఏమీ కనిపించలేదు. ఇంతకంటే కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫారిన్ అఫైర్సన్ సెక్రటరీ సుజాతాసింగ్లాంటి ఎందరినో చూస్తున్నాం కదా! పాస్‌పోర్టు అధికారిగా ఫస్ట్ ఉమన్‌గా రికార్డు మీదే. మరి ఫస్ట్తోపాటు బెస్ట్ రికార్డు కూడా మీ ఖాతాలో చేరాలంటే... అశ్విని: నాకు ముందు ఈ బాధ్యత నిర్వర్తించిన శ్రీకర్ రెడ్డి గారు చాలామంచి సిస్టమ్‌ను రూపొందించారు. అప్పుడు నేను డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్ని. ఇప్పుడూ ఆయన బాటలోనే పని చేస్తున్నాను. పాస్‌పోర్టు సేవల పట్ల ప్రజల్లో ఇంతకు ముందుకంటే ఇప్పుడు నమ్మకం పెరిగింది. అప్లయ్ చేస్తే పాస్‌పోర్టు వస్తుందనే భరోసా కలిగింది. మా సేవల్లో ప్రతి అంశాన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా అదే ‘బెస్ట్ సర్వీస్’ రికార్డును తెస్తుంది. పాస్‌పోర్టు ఏజెంట్ సిస్టమ్ తొలగిపోవాలంటే... అశ్విని: పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు చాలా వరకు పారదర్శకంగా మారింది. ఎవరికి వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కొంతయినా ఉండాలి. నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సౌకర్యం కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ట్రాన్స్పరెంట్ సిస్టమ్‌లో ఏజెంట్ అవసరమే లేకుండా పాస్‌పోర్టును అందుకోవచ్చు. తప్పదనుకుంటే సేవాకేంద్రాల సహాయం తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క పౌరునికీ తప్పని సరా? అశ్విని: పాస్‌పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. సిటిజన్‌షిప్ డాక్యుమెంట్ కాదు. తప్పని సరి కాదు. పాస్‌పోర్టు సమగ్రమైన డాక్యుమెంట్ కదా? అశ్విని: పాస్‌పోర్టు... ప్రభుత్వం ఇచ్చిన అనేక ధృవపత్రాల ఆధారంగా జారీ అయి ఉంటుంది. కాబట్టి ఓ భరోసా. రోజూ పాస్‌పోర్టు కోసం వచ్చే దరఖాస్తులు, జారీ చేస్తున్న పాస్‌పోర్టుల నిష్పత్తి సమంగా ఉంటోందా? అశ్విని: బేగంపేటలో రోజుకు 800 వస్తున్నాయి. రోజుకు వెయ్యి పాస్‌పోర్టులు జారీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆఫీసు ఇది. అన్ని డాక్యుమెంట్లూ సరిగ్గా ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. తత్కాల్ అయితే 48 గంటల లోపు జారీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామీణుల కోసం అవగాహన సదస్సుల వంటివి... అశ్విని: గ్రామీణులలో పాస్‌పోర్టు పట్ల చైతన్యం తీసుకురావడం నా ప్రధానమైన అజెండా. విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌కి శిక్షణ ఇవ్వబోతున్నాం. పాస్‌పోర్టు సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. నకిలీ పాస్‌పోర్టును అడ్డుకోవడం ఎలా? అశ్విని: ఒకప్పుడు చేత్తో రాసేవారు. ఇప్పుడు అన్నీ మెషీన్ రీడ్ పాస్‌పోర్టులే, బయో మెట్రిక్ సిస్టమ్‌లో నకిలీకి ఆస్కారం ఉండదు. తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టు కోసం వస్తే? అశ్విని: మాకు చర్య తీసుకునే అధికారం ఉండదు. మేము పాస్‌పోర్టు జారీ చేయడానికి అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారం నకిలీ అని నాకు వ్యక్తిగతంగా తెలిసినా సంబంధిత అధికార విభాగం జారీ చేసిన డాక్యుమెంట్‌ని నేను గౌరవించాల్సిందే. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారికి మీరు ఈ డాక్యుమెంట్‌ను మరోసారి సరి చేసుకోగలరు అని సూచించగలం. దేశంలోపల ఉద్యోగం, దేశం వెలుపల ఉద్యోగంలో తేడా? అశ్విని: పౌరులకు నేరుగా సేవ అందిస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న విభాగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దేశం బయటకు వెళ్లినప్పుడు ‘నేను నా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక బాధ్యత. జాబ్ సాటిస్ఫాక్షన్ పొందిన సందర్భం? అశ్విని: గత ఏడాది డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయి పాస్‌పోర్టు విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన ఉద్యోగం అనిపించిన సందర్భం ? అశ్విని: పబ్లిక్ సర్వీస్‌లో చాలెంజెస్ ఉంటాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మొదటి రోజునే అనుకున్నాను. అయితే కష్టం అనిపించిన సందర్భం ఇంత వరకూ రాలేదు. కుటుంబ వివరాలు... హాబీలు... అశ్విని: నేను సింగిల్. నా హాబీ క్రమశిక్షణతో పని చేయడమే. చివరగా పౌరులకు ఓ సూచన! అశ్విని: పాస్‌పోర్టు జారీ చేసే పనిని మా స్టాఫ్ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతగా చేయట్లేదు. మన పౌరులకు చేస్తున్న సేవ అనే ధోరణితో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. దీనిని కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తాం. - వాకా మంజులారెడ్డి సామాన్యులకు మీరిచ్చే సూచన? అశ్విని: ఏజెంట్లు ‘‘నేను చిటికెలో ఇప్పిస్తాను’’ అన్నట్లు చెబుతుంటారు. ఆ మాటలను నమ్మవద్దు. మీరే స్వయంగా పాస్‌పోర్టు ఆఫీసు లోపలికి రండి. ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదో అత్యవసరం ఏర్పడుతుంది. ఆ సమయానికి పాస్‌పోర్టు సిద్ధమవుతుందా లేదా అనే అయోమయంలో ఏజెంట్లను ఆశ్రయిస్తారు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే - దయచేసి ఉదయం 9.30-11.30 మధ్య మా బ్యాక్ ఆఫీస్‌కి రండి. అన్ని వివరాలనూ తెలుసుకోండి. ఇప్పుడు సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. -
ఇల్లు కట్టిచూడు
- నింగిని తాకిన నిర్మాణ సామాగ్రి ధరలు - మార్కెట్లో సిమెంటు కొరత - స్తంభించిన గృహ నిర్మాణాలు - ఇబ్బందుల్లో 2.50 లక్షల మంది కార్మికులు విజయవాడ సిటీ : సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన భవన నిర్మాణ ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన.. రాజధాని ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గృహ నిర్మాణ సామగ్రి ధరలు కూడా చుక్కలనంటడంతో జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ రంగానికి అనుబంధంగా 26 రకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న సుమారు 2.50 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు పనుల్లేక పస్తులుంటున్నాయి. రెండేళ్లుగా రకరకాల ఇబ్బందులతో నిర్మాణ రంగం నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర విభజన క్రమంలో విజయవాడ చుట్టూ పెండింగులో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భూముల విలువలకు రెక్కలొచ్చినట్లే నిర్మాణ రంగంలో ముడిసరకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికితోడు మార్కెట్లో సరకు లభ్యం కాకపోవడంతో నిర్మాణ రంగంలో స్తబ్దత నెలకొంది. సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు గృహ నిర్మాణంసమెంటు కృత్రిమ కొరత.. కొన్ని కంపెనీలు హఠాత్తుగా సిమెంట్ కొరతను సృష్టించాయి. తెలంగాణ ప్రాంతంలో కంపెనీల నుంచి మన ప్రాంతానికి స్టాక్ ఇవ్వకపోవడంతో నగర మార్కెట్లో సిమెంట్ కొరత ఏర్పడింది. దీంతో డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను అమాంతం నల్లబజారుకు తరలించారు. ఈ క్రమంలో కృత్రిమ కొరత ఏర్పడింది. పైనుంచి స్టాక్ రావడం లేదనే సాకుతో డీలర్లు అమ్మకాలను నిలిపివేశారు. కొద్ది రోజులుగా బ్రాండెడ్ సిమెంటు దొరకక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎన్నికల ముందు వరకు బస్తా రూ. 230 ఉన్న బ్రాండెడ్ సిమెంటు ఇప్పుడు రూ.350కి విక్రయిస్తున్నారు. బ్లాకులో అయితేనే బ్రాండెడ్ సరకు ఇస్తున్నారు. జిల్లాలో 300కు పైగా సిమెంటు షాపులు, డీలర్లు ఉన్నారు. వీటి ద్వారా సీజన్లో నెలకు 50 వేల టన్నుల సిమెంటు విక్రయాలు జరుగుతుంటాయి. అన్‌సీజన్‌లో కూడా దాదాపు 25 వేల టన్నుల సిమెంటు విక్రయిస్తారని అంచనా. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల సిమెంటు కొరత ఏర్పడింది. ఇసుకకూ ఇక్కట్లే.. జిల్లాలో 72 ఇసుక క్వారీలున్నాయి. వీటికి ఏడాది నుంచి వేలం పాటలు నిర్వహించకుండా పెండింగులో ఉంచారు. దీంతో ఎక్కడికక్కడ ఇసుక మాఫియాలు పెచ్చుపెరిగి అక్రమ తవ్వకాలు సాగించి అధిక రేట్లు దండుకుంటున్నారు. పదిటైర్ల లారీ ఇసుకకు రూ.17 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. ఏడున్నర వేలు వసూలు చేస్తున్నారు. అదీ దూర ప్రాంతాలకు అయితే మరింత గుంజుతున్నారు. భారీగా పెరిగిన ఇనుము, కంకర ధరలు.. నెల రోజులుగా నగర మార్కెట్లో స్టీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇనుము ధరలు సగటున రూ. 40 వేల నుంచి రూ. 52 వేల వరకు పెరిగాయి. కంకర ధరను కూడా బాగా పెంచేశారు. నెల రోజుల క్రితం రెండు యూనిట్ల కంకర రూ. ఆరు వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. ముడిసరకు ధరలు పెరగడంతో ఆ ప్రభావం భవన నిర్మాణ రంగంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న రాడ్‌బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ తదితర వృత్తులలో పనిచేసే కార్మికులు పనుల్లేక, పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. -
ఇదేంది సారూ!!
కామారెడ్డి, న్యూస్‌లైన్: ఎన్నికల నిబంధనల మాటేమిటోగానీ, సామాన్యులు మాత్రం తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటోంది. పోలీసులే గాక రెవెన్యూ, పౌర సరఫరాల నిఘా తదితర విభాగాలకు చెందిన అధికారులంతా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలలో లభించిన డబ్బుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీజ్ చేస్తున్నారు. దీంతో అత్యవసరంగా డబ్బును తీసుకెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేల కన్నా ఎక్కువ డబ్బుంటే అధికారులకు సీజ్ చేసే అధికారం ఉంది. అయితే భిక్కనూరు మండలంలో ఓ వ్యక్తి వద్ద రూ. 40,400 మాత్రమే ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సీజ్ చేశారు. బాధితుడు బోరుమన్నా వారు వినిపించుకోలేదు. ప్రతిరోజు జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బులను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన డబ్బులకు సంబంధించి ఆధారాలను ఆదాయపు పన్ను శాఖకు చూపితే నిబంధనల ప్రకారం విడుదల చేస్తారని అధికారులు బాధితులకు స్పష్టం చేస్తున్నారు. అయితే తమ అవసరాల కోసం వెంట డబ్బులు తీసుకెళ్లేవారిలో అత్యధికులు సామాన్యులే కావడం వల్ల అనేక ఇక్కట్లకు గురికావలసి వస్తోంది. పెళ్లి బంగారం కొనాలన్నా పరేషానే బంగారం ధర అడ్డగోలుగా పెరిగింది. పెళ్లిళ్ల కోసం తక్కువలో తక్కువ ఐదు తులాలు కొనాలన్నా రూ.లక్షన్నర, బట్టల కోసం మరో రూ. 50 వేలు వెం ట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో తమ వెంట ఉన్న డబ్బులు బంగారం కొనుగోలుకు, బట్టల కొనుగోలుకు అని చెప్పినా అధికారుల అర్థం చేసుకోలేకపోతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు.. వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన వారు మరీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నిత్యం లక్షల్లో డబ్బు లు చేతులు మారుతుంటాయి. అయితే వెంట డబ్బు లు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ వద్ద నుంచి డబ్బును సీజ్ చేశారు. టైర్ల షోరూం యజమాని నుంచి, ఓ బీడీ కంపెనీకి చెం దిన గుమస్తా నుంచి డబ్బులను సీజ్ చేయడం వల్ల వారి డబ్బు ఇరుక్కుపోయింది. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చూపాల్సిన పరిస్థితుల్లో వారు అవస్థలు పడుతున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శెనిశెట్టి గౌరీశంకర్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ఎన్నికల కోసం అక్రమంగా డబ్బు లు రవాణా విషయంలో చర్యలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే వ్యాపారులు, సామాన్య ప్రజల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని కోరారు.