ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట! | Intelligent people have one thing in common | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట!

Published Wed, May 25 2016 9:42 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట!

ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట!

లండన్: మిగతావారితో పోల్చితే ప్రజ్ఞావంతులు అన్ని విషయాల్లో ముందుంటారు. వారికున్నటువంటి ఎక్కువ ఐక్యూ మూలంగా అన్ని వ్యవహారాల్లో దూసుకుపోతుంటారన్నది తెలిసిందే. అయితే ప్రజ్ఞావంతుల్లో కామన్గా ఉండే అంశం ఏంటన్నదానిపై జరిగిన పరిశీలనలో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. అదేంటంటే.. వీరు మిగతావారితో పోల్చితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారట.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో వెల్లడైన ఈ విషయాన్ని 'స్టడీ మేగజైన్'లో ప్రచురించారు. మనుషుల్లో ఉండే ఐక్యూ యావరేజ్ అనేది వారు రాత్రి పూట ఎంత త్వరగా నిద్రపోతున్నారనే అంశాన్ని ప్రభావితం చేస్తోందని దీనిలో వెల్లడించారు.

మరి నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు విధి నిర్వహనలో భాగంగా మెలకువతో ఉంటారు కదా.. అలా అని వారికి ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లా అని అడుగుతున్నారు కొందరు.  అయితే.. రాత్రిపూట మొత్తం పార్టీల్లో గడిపేసి పగలు  నిద్రపోయే రాత్రిజీవుల్ని సపోర్ట్ చేసేలా ఉన్న ఈ ఫలితాలను అనుకరించాలని ప్రయత్నించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని సలహా ఇస్తున్నారు ఇంకొందరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement