
లక్నో: ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పైకప్పు కొంతభాగం కూలిపడిన ఘటనలో తల్లిదండ్రులు, వారి ముగ్గురు చిన్నారులు మృత్యువా తపడ్డారు. ఆలంబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ రైల్వే కాలనీలో శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల సమయంలో పారిశుధ్య సిబ్బంది గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి శిథిలాల నుంచి చంద్ర, సరోజినీ దేవి(35), వారి పిల్లలు హర్షిత్(13), హర్షిత(10), అన్‡్ష(5) మృతదేహాలను వెలికి తీశారు. కాలనీలోని వారుంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఖాళీ చేయమని నోటీసులిచ్చినా పట్టించుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment