parents death
-
పైకప్పు కూలిపడి అయిదుగురు మృత్యువాత
లక్నో: ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పైకప్పు కొంతభాగం కూలిపడిన ఘటనలో తల్లిదండ్రులు, వారి ముగ్గురు చిన్నారులు మృత్యువా తపడ్డారు. ఆలంబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ రైల్వే కాలనీలో శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల సమయంలో పారిశుధ్య సిబ్బంది గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి శిథిలాల నుంచి చంద్ర, సరోజినీ దేవి(35), వారి పిల్లలు హర్షిత్(13), హర్షిత(10), అన్‡్ష(5) మృతదేహాలను వెలికి తీశారు. కాలనీలోని వారుంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఖాళీ చేయమని నోటీసులిచ్చినా పట్టించుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. -
తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా? -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది
సాక్షి, వెబ్‌డెస్క్: పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయరు. ప్రతీది వారి ముందుకే తెచ్చిపెడతారు. ఏమంటే.. పిల్లలు ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఆ ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది పరీక్షల ముందు ఏకంగా అమ్మానాన్న మరణిస్తే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. పరీక్షల్లో పాసవ్వడం సంగతి అటుంచి.. అసలు చాలా మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విద్యార్థిని అందుకు భిన్నం. తల్లిదండ్రులను కోల్పోయాననే బాధ వెంటాడుతున్నప్పటికి.. వారు తనమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే తన బాధ్యత అనుకుంది. మరింత దీక్షగా చదివి.. టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని స్టోరి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. బుధవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలోల మధ్యప్రదేశ్‌కు చెందిన వనీషా పఠాక్ టాపర్‌గా నిలిచింది. స్కూల్ యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నప్పటికి.. పెద్దగా సంతోషించలేకపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో తన పక్కనే ఉండి.. తన విజయంలో పాలు పంచుకుని.. తన కన్నా ఎక్కువగా మురిసిపోవాల్సిన తన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ఫస్ట్ వచ్చిన సంతోషం కంటే.. అమ్మనాన్న లేరనే విషయమే వనీషాను ఎక్కువ బాధిస్తుంది. తల్లిదండ్రులతో వనీషా పఠాక్ (ఫైల్ ఫోటో) ఈ సదర్భంగా వనీషా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోతాహిస్తూ ఉండేవాళ్లు. జీవితాంతం నన్ను పోత్సాహిస్తూనే ఉంటారు. నా పరీక్షల ముందే వారిద్దరికి కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు. నేను చివరి సారిగా ఈ ఏడాది మే 2న మా అమ్మతో మాట్లాడాను. మే 4న ఆమె చనిపోయారు. అప్పటికే మా నాన్న కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ మా బంధువులు నాకు ఆ విషయం చెప్పలేదు. మే 10న నాన్నతో చివరి సారి మాట్లాడాను. ఐదు రోజుల తర్వాత నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాతే నాకు అమ్మనాన్న చనిపోయారనే విషయం చెప్పారు. అమ్మ మృతదేహాన్ని కూడా చూడలేకపోయాను. ‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో.. ధైర్యంగా ఉండి.. మేం త్వరలోనే వస్తాం’’ ఇదే అమ్మ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది వనీషా. ఆ తర్వాత తేరుకుని ‘‘ఇప్పుడు నా జీవితంలో నాకున్న అతిపెద్ద అండ నా సోదరుడు. తను ఇచ్చిన మద్దతు వల్లే నేను అమ్మనాన్న చనిపోయారనే బాధ నుంచి కోలుకుని.. చదువు మీద దృష్టి పెట్టగలిగాను. ఈ రోజు టాపర్‌గా నిలిచాను. నాన్న కలల్ని నేరవేరుస్తాను. అమ్మ కోరుకున్నట్లు నేను ధైర్యంగా ఉంటాను’’ అని తెలిపింది వనీషా. ఇక ఎన్డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం వనీషా తండ్రి జితేంద్ర కుమార్ ఆర్థిక సలహాదారుగా పని చేసేవాడు.. ఆమె తల్లి డాక్టర్ సీమా పఠాక్ స్కూల్ టీచర్‌గా పని చేసేవారు. -
కరోనా బాధిత బాలలను కాపాడుకుందాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూచించింది. కరోనా బాధిత బాలల రక్షణపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్నారని, వీరిలో 1,700 మంది బాలలు ఇద్దరినీ కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు ► కోవిడ్‌తో ప్రభావితులైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలి. ప్రతి ఒక్క చిన్నారి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. ఆ అవసరాలను ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడితే వారి పిల్లలను తాత్కాలికంగా శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించాలి. ఆలనాపాలనా చూసేవారు లేకపోతే సాయం అందజేయాలి. ► శిశు సంరక్షణ పథకాల కింద బాధిత పిల్లల పునరావాసం కోసం వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి. ► శిశు సంరక్షణ కేంద్రాల్లో కరోనా సోకిన చిన్నారులకు అక్కడే ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలి. ► పిల్లలో మానసిక సమస్యలు తలెత్తకుండా సైకాలజిస్టుల కౌన్సెలింగ్ ఇప్పించాలి. ► కరోనా వల్ల అనాథలుగా మారిన బాలలలకు జిల్లా కలెక్టర్లు సంరక్షకులుగా వ్యవహరించాలి. ► బాధిత బాలల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చేందుకు, ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలను వారికి చేరవేసేందుకు కలెక్టర్లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► కరోనా వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లల ఆస్తులు పరులపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. ఇందుకోసం రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగం సేవలు ఉపయోగించుకోవాలి. ► బాధిత పిల్లలపై వేధింపులు, వారి అక్రమ రవాణా, అక్రమ దత్తత, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారడంపై పోలీసు శాఖ నిరంతరం దృష్టి పెట్టాలి. -
నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు?
మోటకొండూర్: ‘నాన్నా.. ఇక రావా.. మమ్మల్ని ఎవరు చూస్తారు.. మేం ఎక్కడ ఉండాలి’అంటూ ఆ ముగ్గురు చిన్నారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు(9) తండ్రికి తలకొరివి పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులు.. ఇప్పుడు తండ్రి మృతితో అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను తలచుకొని, ఇద్దరు చెల్లెల్ని గుండెలకు హత్తుకొని గుండెలవిసేలా ఏడ్చింది. ఉండేందుకు సొంత ఇల్లు కూడాలేదు. ఈ దయనీయమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కదిరేణిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ (38), య మున భార్యాభర్తలు. అశోక్ గీత కార్మికుడు. వీరికి రేణు (9), సుప్రియ(7), జోస్నవి (5) సంతానం. రేణు 3వ తర గతి, సుప్రియ 2వ తరగతి చదువుతున్నారు. తండ్రి కులవృత్తే ఈ కుటుంబానికి జీవనాధారం. ఈ క్రమంలో యము న ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అశోక్ 20 రోజుల క్రితం తాటిచెట్టుపై నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం చనిపోయాడు. కనీసం వీరికి ఉండటానికి ఇల్లు కూడా లేదని, పిల్లలను ఎలా సాకాలో తెలియడంలేదని అశోక్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు వయసు మీదపడటంతో ముగ్గురు మనవరాళ్ల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం -
ఆ అనాథ బాలలకు సాయపడండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ లేదా తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారుల వివరాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కోవిడ్ లేదా ఇతర కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను గుర్తించి, వారికి రాష్ట్రాలు తక్షణమే సాయం అందించాలంటూ సుమోటోగా స్వీకరించిన కేసుపై శుక్రవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘కరోనా బారినపడి తల్లి, తండ్రి, లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు మహారాష్ట్రలో 2,900 మంది వరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహమ్మారి బారినపడి దిక్కులేని వారిగా మారిన ఇటువంటి చిన్నారులు ఇంకా ఎందరు ఉన్నారో ఊహించలేం. మా ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా.. ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరిగే అటువంటి బాలలను తక్షణమే గుర్తించి, వారి బాధ్యతను యంత్రాంగం తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. అనాథలైన చిన్నారుల వివరాలు తక్షణమే లేదా శనివారం సాయంత్రానికి ‘బాల్ స్వరాజ్’ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ ఒకటో తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. -
మీ మరణంతో నా జీవితంలో శూన్యం
కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో కోవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీ నటుడు గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి మరణించారు. వారు చనిపోయి నేటికి పది రోజులు అవుతోంది. ఈ క్రమంలో నటుడు తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వారి మరణం తన జీవితంలో అంతులేని శూన్యాన్ని నింపిందని.. ఎంత కాలం గడిచిన ఇది పూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రే తనకు స్ఫూర్తని.. తల్లి ఎంతో బలవంతురాలని తెలిపారు. ‘నా హీరో.. నా ఆదర్శం.. నా ప్రేరణ. తండ్రులందరూ మీలా ఉండరనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి నాకు పాతికేళ్లు పట్టింది. నటుడిగా కన్నా ముందే మీ కొడుకుననే గుర్తింపు నాకు దక్కింది. ఇది నాకు ఎంతో గర్వకారణం. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను నాన్న’ అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు గౌరవ్. (చదవండి: నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి) గౌరవ్ తల్లి గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతన్నారు. కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. ‘నా తల్లి ఎంతో స్ట్రాంగ్ పర్సన్. ఆమె అందానికి ఎలాంటి అలంకరణ అవసరం లేదు. తన అభిమానులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారు. ఉపాధ్యాయురాలిగా, ప్రిన్సిపాల్‌గా, సహోద్యోగిగా, స్నేహితుడిగా, అన్నింటికి మించి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించే మనిషిగా ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. మిస్ యూ అమ్మా’ అంటూ గౌరవ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. నటుడికి ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
అమ్మా..నేనొచ్చాను
కార్తీక మాస విహార యాత్ర పలు కుటుంబాల్లో విషాదాన్ని నిలిపింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆదివారం బోటు బోల్తా పడింది. ఒంగోలు యాత్రికులు కొందరు మృత్యువాత పడ్డారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. బంధువులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): అమ్మ.. నేను విజయవాడ వస్తున్నా...’ అంతా బాగానే ఉంది అని ఫోన్ చేసిన గంటలోపే తల్లిదండ్రులు మృత్యువాత పడటం ఆ మెడికోను తీవ్రంగా కలిచివేసింది. గుంటూరు జిల్లా కాటూరి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పవన్ తండ్రి కె.ఆంజనేయులు ఒంగోలులో బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నాడు. భార్య వెంకటరమణతో కలిసి విహార యాత్రకు వచ్చారు. పవిత్రసంగమం వద్ద బోటు ప్రమాదంలో ఆంజనేయులుతో పాటు, వెంకట రమణ మృతి చెందింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పవన్ తన మిత్రులతో కలసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ తన తండ్రి మృతదేహాన్ని చూసి కుప్పకూలాడు. కొద్దిసేపటికే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తల్లి వెంకటరమణ కూడా మృతి చెందినట్లు పవన్‌మిత్రలకు తెలియడంతో ఆ విషయం అతడికి కొద్దిసేపటి వరకూ తెలియనివ్వలేదు. మా అమ్మ ఎక్కడా అంటూ విలపించడంతో విషయం చెప్పకతప్పలేదు. -
ఎంత కష్టం!
ఉలవపాడు : ఆ చిన్నారులకు ఇంకా ఊహే తెలియదు. తల్లి చాటు బిడ్డలు వారు. అలాంటి చిట్టి హృదయాలకు కొండంత కష్టం వచ్చింది. శనివారం గుడ్లూరు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. విగత జీవులుగా ఉన్న తల్లిదండ్రులను చూసి మళ్లీ వస్తారేమోనని ఆ చిన్నారులు పిలుస్తుంటే అక్కడి వారి హృదయాలు తల్లడిల్లిపోయాయి. మండల పరిధిలోని బద్దిపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నలగంగు రవి (35), నారాయణమ్మ (30) దంపతులు తమ చిన్న కుమార్తె మూడేళ్ల గ్రీష్మతో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తగారి ఊరు వెళ్తున్నారు. మార్గమధ్యంలో గుడ్లూరు మండల పరిధిలోని మన్నేరు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారిద్దరి మధ్యలో కూర్చోన్న చిన్న కుమార్తె గ్రీష్మ ఎగిరి చెట్లలో పడటంతో ప్రాణాలతో బయటపడింది. మృతదేహాలను ఆదివారం స్వగ్రామం బద్దిపూడి తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతుల పెద్ద కుమార్తె ఏడేళ్ల నందిని, మూడేళ్ల గ్రీష్మలు అనాథలుగా మిగిలిపోయారు. చివరకు నాయనమ్మ రమణమ్మే ఆ చిన్నారులకు దిక్కయింది. తాత కూడా లేడు. కొడుకు, కోడలు మరణించడంతో రమణమ్మ ఒంటరైంది. వయసుపై బడింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంటి పరిస్థితి చూసిన వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ బిడ్డలకు తోడెవరు? అసలే పేద కుటుంబం. ఇప్పటి వరకూ రమణమ్మ కుమారుడే చెరువుల వద్ద విద్యుత్ పనులు చేసి కుటుంబాన్ని పోషించాడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరూ లేని ఆ తల్లి రమణమ్మ, చిన్నారుల పరిస్థితి ఏమిటో గ్రామస్తులకు అర్థం కావడం లేదు. మాటలు కూడా సరిగా రాని చిన్న కుమార్తె గ్రీష్మ అందరూ ఏడుస్తుంటే తానూ ఏడుస్తోంది. -
విషాద పరీక్ష అవధి లేని శోకం
♦ ఇద్దరు విద్యార్థులకు విషాద పరీక్ష ♦ కన్నవారు మృతి చెందడంతో తీరని వేదన ♦ అయినా పరీక్ష రాసిన విద్యార్థులు ♦ దేవరాపల్లి, పెదబయలులో కన్నీటి ఘటనలు పదో తరగతే పెద్ద పరీక్షనుకునే ఆ పిల్లలిద్దరికీ విధి చెప్పనలవి కానంత కఠినమైన పరీక్ష పెట్టింది. రేపేం ప్రశ్నలొస్తాయోనని ఆందోళనతో సతమతమయ్యేంత సున్నిత మనస్కులను భరించలేనంత కర్కశమైన సంఘటనతో అతలాకుతలం చేసింది. అనుకోని ప్రశ్న వస్తేనే బెంబేలెత్తే బేల హృదయాలున్న వారిని ఊహించనలవి కాని పరిణామాలతో విలవిలలాడేలా చేసింది. పరీక్షల వేళ కాస్త అలజడిని కూడా తట్టుకోలేని వయస్సులో ఉన్న ఆ ఇద్దరి కన్నవారిని ఎత్తుకుపోయి క్రూరంగా పరిహసింది. రేపు పరీక్షనగా ఈరోజు జరిగిన ఘోరాలతో ఆ విద్యార్థి, విద్యార్థిని గుండెల్లో కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగింది. అయితే అంత దుఖాన్ని పంటి బిగువున అణచిపెట్టి పరీక్ష రాసిన వారిని చూసి చివరికి విధి హృదయం కూడా బరువెక్కే ఉంటుంది. దేవరాపల్లి/ పెదబయలు: మరి కొన్ని గంటల్లో పరీక్ష రాయనున్నారనగా ఆ విద్యార్థులిద్దరికీ ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని పరీక్ష ఎదురైంది. ఓ విద్యార్థి, ఓ విద్యార్థిని టెన్త్ సాంఘిక శాస్త్రం-1 పరీక్ష రాయబోతున్న తరుణంగా కన్నవారికి కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. దేవరాపల్లి, పెదబయలుల్లో ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఒకరు తండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయి వేదనతో విలవిలలాడాల్సి వచ్చింది. అయితే తీరని ఆవేదనలోనూ శనివారం సోషల్-1 పరీక్ష రాయడంతో ప్రతి ఒక్కరి హృదయం చెమ్మగిల్లింది. దేవరాపల్లి గాంధీవీధికి చెందిన కదిరి ప్రసాద్ తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. అతని తండ్రి అప్పారావు (40) కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. ప్రసాద్ ఏకైక కుమారుడు. అతడే తండ్రికి తలకొరివి పెట్టాలి. విద్యా సంవత్సరం కోల్పోకూడదన్న ఆలోచనతో ప్రసాద్ పరీక్షకు హాజరయ్యాడు. తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ పరీక్ష రాసివచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రికి తలకొరివి పెట్టాడు. ఈ సంఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను కన్నీటిలో ముంచెత్తింది. దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం పెదబయలు గ్రామానికి చెందిన సల్లంగి శ్రావణి స్థానిక ఎస్టీ ఆన్స్ పాఠశాలలో టెన్త్ చదువుతూ అక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం-2లో పరీక్ష రాస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తల్లి సల్లంగి వరహాలమ్మ(48) ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. తండ్రి సల్లంగి జగన్నాథం ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తల్లి మృతదేహం వద్ద కూర్చొని రోదించిన శ్రావణి శనివారం విషాదకర పరిస్థితుల్లో పరీక్షకు హాజరయింది. దుఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసింది. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగొచ్చి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.