
మోటకొండూర్: ‘నాన్నా.. ఇక రావా.. మమ్మల్ని ఎవరు చూస్తారు.. మేం ఎక్కడ ఉండాలి’అంటూ ఆ ముగ్గురు చిన్నారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు(9) తండ్రికి తలకొరివి పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులు.. ఇప్పుడు తండ్రి మృతితో అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను తలచుకొని, ఇద్దరు చెల్లెల్ని గుండెలకు హత్తుకొని గుండెలవిసేలా ఏడ్చింది. ఉండేందుకు సొంత ఇల్లు కూడాలేదు. ఈ దయనీయమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
కదిరేణిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ (38), య మున భార్యాభర్తలు. అశోక్ గీత కార్మికుడు. వీరికి రేణు (9), సుప్రియ(7), జోస్నవి (5) సంతానం. రేణు 3వ తర గతి, సుప్రియ 2వ తరగతి చదువుతున్నారు. తండ్రి కులవృత్తే ఈ కుటుంబానికి జీవనాధారం. ఈ క్రమంలో యము న ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
అశోక్ 20 రోజుల క్రితం తాటిచెట్టుపై నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం చనిపోయాడు. కనీసం వీరికి ఉండటానికి ఇల్లు కూడా లేదని, పిల్లలను ఎలా సాకాలో తెలియడంలేదని అశోక్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు వయసు మీదపడటంతో ముగ్గురు మనవరాళ్ల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం
Comments
Please login to add a commentAdd a comment