కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో కోవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీ నటుడు గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి మరణించారు. వారు చనిపోయి నేటికి పది రోజులు అవుతోంది. ఈ క్రమంలో నటుడు తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వారి మరణం తన జీవితంలో అంతులేని శూన్యాన్ని నింపిందని.. ఎంత కాలం గడిచిన ఇది పూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రే తనకు స్ఫూర్తని.. తల్లి ఎంతో బలవంతురాలని తెలిపారు. ‘నా హీరో.. నా ఆదర్శం.. నా ప్రేరణ. తండ్రులందరూ మీలా ఉండరనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి నాకు పాతికేళ్లు పట్టింది. నటుడిగా కన్నా ముందే మీ కొడుకుననే గుర్తింపు నాకు దక్కింది. ఇది నాకు ఎంతో గర్వకారణం. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను నాన్న’ అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు గౌరవ్. (చదవండి: నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి)
గౌరవ్ తల్లి గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతన్నారు. కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. ‘నా తల్లి ఎంతో స్ట్రాంగ్ పర్సన్. ఆమె అందానికి ఎలాంటి అలంకరణ అవసరం లేదు. తన అభిమానులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారు. ఉపాధ్యాయురాలిగా, ప్రిన్సిపాల్‌గా, సహోద్యోగిగా, స్నేహితుడిగా, అన్నింటికి మించి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించే మనిషిగా ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. మిస్ యూ అమ్మా’ అంటూ గౌరవ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. నటుడికి ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment