Television actor
-
రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!
ఒకప్పటి అమెరికా టెలివిజన్ టాక్ షో సృష్టికర్త, నిర్మాత ఫిల్ డోనాహ్యూ బంగ్లా నేలమట్టమవుతోంది. ఇంద్ర భవనం లాంటి ఆ బంగ్లా ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆయన హయాంలో అది దాదాపు 200 కోట్లకు విక్రయించిన విలావంతమైన భవనాన్ని నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్ వద్ద ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేసే ఆ కట్టడం కనుమరుగువుతుందంటే చుట్టు పక్కల నివాసితులు సైతం కలత చెందారు. అంతలా అందర్నీ కట్టిపడేసిన భవనం ఎందుకు కూల్చేయాలనకుంటున్నారు? ప్రధాన కారణం ఏమిటో వింటే అవాక్కవుతారు. వివరాల్లోకెళ్తే..రాజభవనంలా ఉండే గోల్డ్ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనర్ ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్ ఆఫ్ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. 80వ దశకంలో టాక్ షో సృష్టికర్త డోనాహ్య, అతని భార్య, నటి మార్లో థామస్ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఈ బంగ్లాలో ఇతర వెస్ట్పోర్ట్ నివాసితులు, మరికొందరూ నటీనటులు ఎందరో ఇక్కడ గడిపి వెళ్లేవారు. 2006లో డొనహ్యు ఆ బంగ్లా దగర్లోనే మరో మల్టి మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‌ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్లకు అల్లిసన్‌కు అనే ఫైనాన్షియర్‌కి విక్రయించి వార్తల్లో నిలిచాడు. అల్లిసన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వద్ద అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పనిచేసేవాడు. నాటి ఒబామా సైతం బీచ్ వద్ద ఉండే ఈ అందమైన భవనం కోసం డబ్బును వెచ్చించేందుకు యత్నించినట్లు సమాచారం. 2013లో అల్లిసన్ మరణం తర్వాత ఆ భవనాన్ని పర్యవేక్షించేవాళ్లు లేరు. 2020లో రైనర్ దంపతులు కేవలం రూ. 136 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఆ భవనం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అది రాత్రి పూట సంచరించే ఎలుకలకు నిలయంగా మారింది. దీంతో ఆ దంపతులు ఈ బంగ్లాను కూల్చివేసేలా అనుమతించాలని హిస్టారిక్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. హిస్టారిక్ డిస్డ్రిక్ కమిషన్ మాత్రం ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజుల నిరీక్షించాలని ఆ దంపతులకు స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్ వెల్లడించింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం తోపాగు అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ యత్నిస్తోంది. (చదవండి: కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..) -
వ్యూ నుంచి ప్రీమియం ఫీచర్లతో టీవీలు
హైదరాబాద్: వ్యూ టెలివిజన్స్ 2023 ఎడిషన్ ప్రీమియం టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో, బ్రైట్ డిస్ ప్లేతో, చక్కని సౌండ్ పరిజ్ఞానంతో, మంచి వీక్షణ అనుభవాన్నిస్తాయని సంస్థ ప్రకటించింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. (ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) వీటిల్లో ఏప్లస్ గ్రేడ్ 400 నిట్స్ అధిక బ్రైట్‌నెస్‌తో కూడిన ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. గూగుట్ టీవీ ఓఎస్‌తో, 50 వాట్ ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌తో వస్తుందని పేర్కొంది. 43 అంగుళాల ధర రూ.23,999, 55 అంగుళాల టీవీ ధర రూ.32,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వూటీవీస్ డాట్ కామ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం.. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా..
సాక్షి, ముబై: కొల్హాపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ టెలివిజన్ నటి దుర్మరణం చెందారు. కళ్యాణి కురాలే జాదవ్ అనే 32 ఏళ్ల నటి శనివారం రాత్రి తన టూవీలర్‌పై ఇంటికి వెళ్లుండగా కాంక్రీట్ మిశ్చర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై హలోండి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కళ్యాణిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రవర్‌ను అరెస్ట్ చేసి, అతనిపై కేసు మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కళ్యాణి తుజ్హత్ జీవ్ రంగా, దఖంచ రాజా జ్యోతిబా వంటి మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు సాధించారు. జాదవ్ కొల్హాపూర్ నగరంలోని రాజారంపురి ప్రాంతంలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె హలోండిలో రెస్టారెంట్ ప్రారంభించారు. శనివారం రాత్రి రెస్టారెంట్ మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టినట్లు షిరోలి పోలీస్ అధికారి సాగర్ పాటిల్ తెలిపారు. -
విషాదం.. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ బుల్లితెర నటుడు మృతి
బాలీవుడ్లో విషాదం నెలకొంది. బుల్లితెర నటుడు,మోడల్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ(46) అకస్మాత్తుగా కన్నుమూశారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరణించారు. ఈ ఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అతనికి భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ) కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాందించారు. ఇంతకుముందు అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే సిద్ధాంత్ సూర్యవంశీగా మార్చుకున్నారు. ఇతను పలు టీవీ షోలలో నటించారు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా, వారిస్, సాత్ ఫేరే: సలోని కా సఫర్, కసౌతి జిందగీ కే సీరియల్స్‌తో పాటు టెలివిజన్ షోలలో కనిపించారు. సిద్ధాంత్ చివరిసారిగా జీ టీవీ షో 'క్యూ రిష్టన్ మే కట్టి బట్టి' లో కనిపించాడు. View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) -
మీ మరణంతో నా జీవితంలో శూన్యం
కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో కోవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీ నటుడు గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి మరణించారు. వారు చనిపోయి నేటికి పది రోజులు అవుతోంది. ఈ క్రమంలో నటుడు తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వారి మరణం తన జీవితంలో అంతులేని శూన్యాన్ని నింపిందని.. ఎంత కాలం గడిచిన ఇది పూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రే తనకు స్ఫూర్తని.. తల్లి ఎంతో బలవంతురాలని తెలిపారు. ‘నా హీరో.. నా ఆదర్శం.. నా ప్రేరణ. తండ్రులందరూ మీలా ఉండరనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి నాకు పాతికేళ్లు పట్టింది. నటుడిగా కన్నా ముందే మీ కొడుకుననే గుర్తింపు నాకు దక్కింది. ఇది నాకు ఎంతో గర్వకారణం. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను నాన్న’ అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు గౌరవ్. (చదవండి: నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి) గౌరవ్ తల్లి గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతన్నారు. కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. ‘నా తల్లి ఎంతో స్ట్రాంగ్ పర్సన్. ఆమె అందానికి ఎలాంటి అలంకరణ అవసరం లేదు. తన అభిమానులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారు. ఉపాధ్యాయురాలిగా, ప్రిన్సిపాల్‌గా, సహోద్యోగిగా, స్నేహితుడిగా, అన్నింటికి మించి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించే మనిషిగా ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. మిస్ యూ అమ్మా’ అంటూ గౌరవ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. నటుడికి ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
బుల్లితెర నటుడు ఆకస్మిక మృతి
బనశంకరి : కన్నడ బుల్లితెర నటుడు డైరెక్టర్ చిక్కసురేశ్ (52) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి పదిరోజుల క్రితం చిక్కసురేశ్ గోవా వెళ్లారు. అక్కడ చిక్కసురేశ్ అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ సభ్యులు బెంగళూరు తరలిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడికి భార్య వీణా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పార్దీవ దేహాన్ని హొసకెరెహళ్లిలోని ఆయన నివాసానికి తరలించారు. చిక్కసురేశ్కు ఇటీవల గుండెకు శస్త్రచికిత్స జరిగింది. పలువురు టీవీ కళాకారులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పదిమందికి అన్నం పెడితే పరమానందం
బుల్లితెర నటుడు, నిర్మాత శ్రీరామ్ పి.గన్నవరం: ఫంక్షన్ల పేరిట సొమ్ము వృథా చేసేకన్నా పదిమందికీ అన్నం పెడితే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని టీవీ నటుడు, సీరియల్ నిర్మాత కొలిశెట్టి శ్రీరామ్ అన్నారు. ‘విధి, ఉమ్మడి కుటుంబం, కావ్యాంజలి, రక్త సంబంధం’ వంటి సీరియల్స్‌లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ఆయన స్వగ్రామం పి.గన్నవరంలో జరుగుతున్న అమ్మవారి జాతరకు వచ్చారు. ఆ సందర్భంగా సోమవారం తనను కలిసిన ‘సాక్షి’తో మనోభావాలను ఇలా పంచుకున్నారు. ‘బీఎస్సీ, బీఈడీ చేశాను. టీచర్ కావాలనుకునేవాడిని. ఎస్సై కావాలనేది నాన్న కల. అందుకోసం రోజూ పొద్దున్నే నిద్రలేపి నాతో వ్యాయామాలు చేయించేవారు. ఫిజికల్ టెస్ట్‌లో పాసైనా, ఆసక్తి లేక రాత పరీక్ష ఎగ్గొట్టేశా. దాంతో నాన్న కోపడ్డారు. ఏదైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వెళ్లాను. ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాను. కొన్ని నచ్చక చేరలేదు. ఆ సమయంలో దర్శకుడు అనిల్‌కుమార్ ‘విధి’ సీరియల్లో నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, డేంజర్ తదితర చిత్రాల్లో నటించాను. తర్వాత ‘రాధాకల్యాణం’ సీరియల్ నిర్మించాను. ఓ చానల్లో గేమ్‌షో చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘వరూధిని పరిణయం’ సీరియల్‌కు నిర్మాతను. ఫంక్షన్లు చేసుకోం.. మా ఇంట్లో ఏ ఫంక్షన్లూ చేసుకోం. నా పుట్టినరోజు, మా పెళ్లిరోజు కూడా జరుపుకోకుండా అనాథాశ్రమాలకు వెళ్లి ఫంక్షన్లకు అయ్యే డబ్బును అక్కడి వారికి ఇస్తుంటాం. ఒక ఫిజికల్లీ చాలెంజ్డ్ అబ్బాయిని చదివించి ప్రయోజకుడిని చేశాను. ఎంతో సంతృప్తి నిచ్చింది. అమలాపురం సమీపంలోని జనుపల్లిలోని రామాలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష అందించా. ఏటా అనేకమంది పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. భగవంతుని ఆశీస్సులున్నంత కాలం నా వంతు సేవ కొనసాగిస్తా.’