ఒకప్పటి అమెరికా టెలివిజన్ టాక్ షో సృష్టికర్త, నిర్మాత ఫిల్ డోనాహ్యూ బంగ్లా నేలమట్టమవుతోంది. ఇంద్ర భవనం లాంటి ఆ బంగ్లా ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆయన హయాంలో అది దాదాపు 200 కోట్లకు విక్రయించిన విలావంతమైన భవనాన్ని నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్ వద్ద ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేసే ఆ కట్టడం కనుమరుగువుతుందంటే చుట్టు పక్కల నివాసితులు సైతం కలత చెందారు. అంతలా అందర్నీ కట్టిపడేసిన భవనం ఎందుకు కూల్చేయాలనకుంటున్నారు? ప్రధాన కారణం ఏమిటో వింటే అవాక్కవుతారు.
వివరాల్లోకెళ్తే..రాజభవనంలా ఉండే గోల్డ్ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనర్ ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్ ఆఫ్ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. 80వ దశకంలో టాక్ షో సృష్టికర్త డోనాహ్య, అతని భార్య, నటి మార్లో థామస్ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఈ బంగ్లాలో ఇతర వెస్ట్‌పోర్ట్ నివాసితులు, మరికొందరూ నటీనటులు ఎందరో ఇక్కడ గడిపి వెళ్లేవారు.
2006లో డొనహ్యు ఆ బంగ్లా దగర్లోనే మరో మల్టి మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‌ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్లకు అల్లిసన్‌కు అనే ఫైనాన్షియర్‌కి విక్రయించి వార్తల్లో నిలిచాడు. అల్లిసన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వద్ద అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పనిచేసేవాడు. నాటి ఒబామా సైతం బీచ్ వద్ద ఉండే ఈ అందమైన భవనం కోసం డబ్బును వెచ్చించేందుకు యత్నించినట్లు సమాచారం. 2013లో అల్లిసన్ మరణం తర్వాత ఆ భవనాన్ని పర్యవేక్షించేవాళ్లు లేరు. 2020లో రైనర్ దంపతులు కేవలం రూ. 136 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఆ భవనం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది.
అది రాత్రి పూట సంచరించే ఎలుకలకు నిలయంగా మారింది. దీంతో ఆ దంపతులు ఈ బంగ్లాను కూల్చివేసేలా అనుమతించాలని హిస్టారిక్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. హిస్టారిక్ డిస్డ్రిక్ కమిషన్ మాత్రం ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజుల నిరీక్షించాలని ఆ దంపతులకు స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్ వెల్లడించింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం తోపాగు అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ యత్నిస్తోంది.
(చదవండి: కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..)
Comments
Please login to add a commentAdd a comment