
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. బుల్లితెర నటుడు,మోడల్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ(46) అకస్మాత్తుగా కన్నుమూశారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరణించారు. ఈ ఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అతనికి భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ)
కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాందించారు. ఇంతకుముందు అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే సిద్ధాంత్ సూర్యవంశీగా మార్చుకున్నారు. ఇతను పలు టీవీ షోలలో నటించారు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా, వారిస్, సాత్ ఫేరే: సలోని కా సఫర్, కసౌతి జిందగీ కే సీరియల్స్‌తో పాటు టెలివిజన్ షోలలో కనిపించారు. సిద్ధాంత్ చివరిసారిగా జీ టీవీ షో 'క్యూ రిష్టన్ మే కట్టి బట్టి' లో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment