న్యూఢిల్లీ: సైబర్ దాడులనుంచి రక్షణ, ఇతర సెక్యూరిటీ నిమిత్తం పాస్‌వర్డ్స్ చాలా కీలకం. సోషల్ మీడియా అకౌంట్స్ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు. అయినా నిర్లక్క్ష్యమే. బలహీనమైన లేదా సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, చాలా కీలకమైన ఫైనాన్షియల్ డేటాను కూడా హ్యాకర్‌లు ఈజీగా తస్కరించే అవకాశం ఉంది.
ప్రతీ ఏడాది లాగానే 2022లో కూడా యూజర్లు చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తాజాగా సర్వేలో తేలింది. అందులోనూ భారతీయులు ఇంకా బలహీనమైన పాస్‌వర్డ్స్‌ఉపయోగిస్తున్నారని NordPass-2022 అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా ఏకంగా 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను మందికి పైగా భారతీయులు ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ‘‘పాస్‌వర్డ్" అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. భారతదేశంలో దాదాపు 3.5 లక్షల మంది సైన్ అప్ చేయడానికి పాస్‌వర్డ్‌గా “పాస్‌వర్డ్”ని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఇండియాతో దాదాపు 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది.
ఈ సంవత్సరం టాప్ 10 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు 123456, bigbasket, పాస్‌వర్డ్, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy. వీటితోపాటు గెస్ట్, వీఐపీ, 123456 లాంటి పాస్‌వర్డ్‌లను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది,
పాస్‌వర్డ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి
♦ వినియోగదారులు ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి, లేదంటే పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడం, హ్యాక్ చేయడం, యాక్సెస్ చేయడం హ్యాకర్‌కు ఈజీ అవుతుంది.
♦ పుట్టిన రోజులు, పెళ్లి రోజులను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకుండా ఉండటం మంచింది. (ఈజీగా గుర్తు ఉంటుందని దాదాపు అందరూ అలానే చేస్తారు) అలాగే అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్‌వర్డ్ కూర్చుకుంటే మంచిదని నిపుణుల సూచన.
♦ప్రతి నెలా పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేయడం బెటర్. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం మంచి పద్ధతి.
Comments
Please login to add a commentAdd a comment