గత పదేళ్లలో భారతీయులు గృహాల కోసం చేస్తున్న ఖర్చు రెండింతలు పెరిగిందని, ఖర్చులో కూడా ఎక్కువ భాగం అనవసరమైన అంశాలకే ఖర్చు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. బట్టలు, టెలివిజన్ సెట్‌లు, వినోదం కోసం విచక్షణా రహితంగా డబ్బు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.
గృహాలకు, వినోదాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న ప్రజలు ఆహార పదార్థాలు తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ వినియోగంలో ఆహార పదార్థాల కోసం చేసే ఖర్చు 2011-12లో 53 శాతం. అయితే ఇప్పుడు ఇది 46.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఆహారేతర వినియోగం కోసం పెట్టే ఖర్చు 47 శాతం నుంచి 53.6 శాతానికి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించిన సర్వేలో తేలింది.
పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే.. ఆహారం కోసం పట్టణవాసులు పెడుతున్న ఖర్చు 42.6 శాతం నుంచి 39.2 శాతానికి తగ్గిపోయింది. ఆహారేతర వినియోగం 60.8 శాతానికి చేరింది. గతంలో దీనికోసం చేసే ఖర్చు 57.4 శాతంగా ఉండేది.
ఇదీ చదవండి: కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్
ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే.. 2011-12లో పట్టణవాసులు తలసరి ఆదాయం రూ. 2630 నుంచి రూ. 6459కు చేరింది. గ్రామీణప్రాంతాల్లో అయితే తలసరి ఆదాయం 1430 రూపాయల నుంచి రూ. 3773కు చేరింది. తలసరి ఆదాయం పెరిగేకొద్దీ ఆహరం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment