ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఆమోదించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌కు వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 16 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు లేకపోవడంతో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోయి ఎంఈఓ, డీవైఈఓ, డైట్, జూనియర్‌కళాశాలల లెక్చరర్ పోస్టులు భర్తీ కావడంలేదన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని, ఎయిడెడ్, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లకు వెంటనే హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ ఉన్నారు.