ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్‌టీయూ నాయకులు బుధవారం ఢీల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతి పత్రం అందజేశారు.
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్‌టీయూ నాయకులు బుధవారం ఢీల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉన్నందున వెంటనే ప్రతి పాదనలను రాష్ట్రపతికి పంపించి ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి పాత విధానం అమలు చేయాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, కె. జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.