ఉపాధ్యాయులు నిబంధనలు పాటించాలి
Published Wed, Aug 31 2016 12:25 AM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
అయిజ: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల నిబంధనలు పాటించాలని జీహెచ్‌ఎం ఎన్‌ఐ మేరమ్మ కోరారు. మంగళవారం నగరపంచాయతీలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశ సముదాయాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల, తరగతిగది సంసిద్ద కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని సూచించారు. సీ గ్రేడ్ విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి వారికి ప్రత్యేక బోదన చేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని, తెలుగు గణితం, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లపై ఉపాధ్యాయులతో చర్చించారు. నమూన మాదురి పాఠ్యాంశం, బడిబయటి పిల్లల గురించి చర్చించారు. విద్యాంజలి కార్యక్రమం గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement