బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్టపరిహారాల పంపిణీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం జరిగిన రెండో జాతీయ లోక్ అదాలత్‌లో 1.25 కోట్లకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వాహన ప్రమాదాలు, ఇతర కేసుల బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్ట పరిహారం కూడా పంపిణీ జరిగింది. జాతీయ న్యాయ సేవల అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ లోక్ అదాలత్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు సగటున 9 శాతం తగ్గిపోయాయి. శనివారం లోక్ అదాలత్‌ను సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే ప్రారంభించగా, 53 కేసుల్లో 28 కేసులను మూడు సుప్రీం ధర్మాసనాలు పరిష్కరించాయి. కుటుంబ వివాదాలు, వైవాహిక సంబంధ, ప్రమాదాల కేసులు, బ్యాంకు రికవరీలు, రెవెన్యూ వివాదాలు, ఉపాధి హామీ, ఇతర పథకాల్లో నిధుల పంపిణీ వంటి కేసులు పరిష్కారమయ్యాయి.
లోక్ అదాలత్‌లో 1.25 కోట్ల కేసులు పరిష్కారం
Published Sun, Dec 7 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement