జిల్లా న్యాయసేవా అధికార సంస్థ
చైర్మన్, జిల్లా జడ్జి విజయసారథి
వరంగల్ లీగల్ : కేసుల పరిష్కారం నిమిత్తం శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయూలనిజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సి.విజయసారథి ఆచార్యులు కోరారు. గురువారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రధానంగా విద్యుత్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు వేల కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 3600విద్యుత్ కేసులు రాజీకి అవకాశం ఉన్నాయని, 288క్రిమినల్ కేసులూ పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులకు నోటీసులు జారీచేసిన ట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నీలిమా పాల్గొన్నారు.
వరంగల్‌కు రావడం ఆనందంగా ఉంది
సుదీర్ఘకాలం పనిచేసిన వరంగల్‌కు జిల్లా ప్రధాన జడ్జిగా పదోన్నతిపై రావడం ఆనందంగా ఉందని విజయసారథి ఆచార్యులు అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి విజయసారథి మాట్లాడారు. సీనియర్ న్యాయవాదులు ఉన్న ఓరుగల్లు నుంచి తర్ఫీదు పొందానని, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన సందర్భంగా ఇక్కడి న్యాయవాదులతో ఏర్పడ్డ అనుబంధం మరువలేనిదని అన్నారు.
ముగిసిన శిక్షణ..
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ జడ్జిల రాత పరీక్ష ఉచిత కోచింగ్ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలు బోధించిన రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, జూనియర్ సివిల్ జడ్జి ఆర్.రగునాథ్‌రెడ్డి, కేయూసీ న్యాయ కళాశాల రిటైర్డ్ ప్రిన్స్‌పాల్ విజయలక్ష్మి, ప్రిన్స్‌పాల్ విజయచందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎండీ సర్దార్, జి.భద్రాద్రి, న్యాయవాది టి. సుజాత, తరగతుల నిర్వహణ బోధనలో సమన్వయకర్తగా వ్యవహరించిన న్యాయవాది నగునూరి విద్యాసాగర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి నర్సింహులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లా మహాత్మ, సహాయ కార్యదర్శి పత్తిపాటి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శి నారగోని సునిత, కోశాధికారి దైద డేవిడ్‌రాజ్‌కుమార్, కార్యవర్గ స భ్యులు దేవేందర్, సంతోష్, గౌసియా, శివకుమార్, మురళి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
రేపు హైకోర్టు జడ్జీల రాక
వరంగల్‌క్రైం: హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఎంఎస్. రాంచంద్రరావు, బి.శివశంకర్‌రావు శనివారం వరంగల్‌కు రానున్నారు. ఆదివారం కాజీపేటలో జూనియర్ డివిజన్ సివిల్ జడ్జీలకు జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్ పరిశీలనలో వీరు పాల్గొంటారు.
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
Published Fri, Jul 10 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement