మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి రమణనాయుడు
సంగారెడ్డి టౌన్: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమణనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు సంయమనం పాటించి రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 883 కేసులు పరిష్కారం అయ్యాయని, రూ. 31 లక్షల 89 వేల నష్ట పరిహారం కక్షిదారులకు ఇప్పించామని, రూ.3,37,700లు రీకవరీ చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. ఇందులో ఎంవీ 15, బ్యాంకు 9, సివిల్ 8, క్రిమినల్ 851 కేసులు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి శాంతరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహేష్‌నాథ్, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి హరీష్, న్యాయవాదులు విఠల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, రామరావు, బుచ్చయ్య, చిట్టాగౌడ్, అబ్దుల్‌రబ్, విజయశంకర్‌రెడ్డి, రవీందర్, అనసూయ, మహేష్, విజయ్‌రాజ్, మల్లేశం, సమరసింహారెడ్డి, జ్ఞానోభా, సుభాష్ చందర్, ప్రసాద్ పాటిల్, సంగారెడ్డి డీఎస్‌పీ తిరుపతన్న, సీఐలు ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నరేందర్, ప్రభాకర్, ఎస్సైలు గణేష్, బాలస్వామి శివలింగం, కోటేశ్వరరావు, యాదవ్‌రెడ్డి, ఏఎస్సైలు ఆంజనేయులు, రాములు, రాజు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.