లోక్‌ అదాలత్‌లో అంతిమతీర్పు | lokadalatlo antima terpu | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో అంతిమతీర్పు

Published Sat, Apr 8 2017 7:35 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

లోక్‌ అదాలత్‌లో అంతిమతీర్పు

లోక్‌ అదాలత్‌లో అంతిమతీర్పు

ఏలూరు (సెంట్రల్‌) : అప్పీలు లేని, న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందేందుకు లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సునీత అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన 2,700 పెండింగ్‌ కేసులు శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించటం జరుగుతుందన్నారు. జిల్లాలోని 10 కోర్టుల్లో 22 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లా కోర్టులో 4 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కింద రూ. 4 లక్షల చెక్కును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.సాయిరమాదేవి, రమాదేవి, కె.సునీత, ఎస్‌.శ్రీదేవి, ఎల్‌.శ్రీధర్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement