► జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుమలత
కర్నూలు(లీగల్): జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 11న శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారానికి నిర్వహించే లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు, ప్రీ లిటిగేషన్, కుటుంబ కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 38,490 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఇందులో 15,510 క్రిమినల్ కేసులు, 15 వేలకు పైబడి సివిల్ కేసులు ఉన్నట్లు చెప్పారు.
లోక్ అదాలత్‌లో జరిగే కేసుల పరిష్కారానికి అప్పీళ్లు ఉండవని.. ఇరువురు కక్షిదారులు సామరస్యంగా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపసు పొందవచ్చని, అలాగే చెక్కు బౌన్స్ కేసుల్లో రాజీ అయితే చెల్లించాల్సిన కోర్టు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న 3 బెంచ్‌లలో న్యాయాధికారులు వీవీ శేషుబాబు, ఎంఏ సోమశేఖర్, ఎం.బాబు వీలైనన్ని కేసుల పరిష్కరానికి కృషి చేస్తారన్నారు. విలేకరుల సమావేశంలో లోక్ అదాలత్ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ పాల్గొన్నారు.
11న జాతీయ లోక్ అదాలత్
Published Thu, Jun 9 2016 3:39 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement