సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్‌అదాలత్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్క రోజులోనే ఏకంగా 42,604 కేసులు పరిష్కారమయ్యాయి. కేసులకు పరిహారంగా రూ.48 కోట్ల వరకూ చెల్లింపులు జరగనున్నాయి. ఏపీలోని 13 జిల్లాల్లో 24,640, తెలంగాణలో 17,974 కేసులు పరిష్కారమయ్యా యి. శనివారం జరిగిన లోక్‌అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల సభ్య కార్యదర్శులు మధుసూదన్‌రావు, పీవీ రాంబాబు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఏపీలో పరిష్కారమైన కేసుల్లో 13,625 కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవి కాగా, మిగిలినవి (11,045) ప్రాథమిక విచార ణ దశలో ఉన్నాయి. తెలంగాణలో పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవి 11,117 కాగా మిగిలిన 6,857 కేసులు ప్రాథమిక దశలో ఉన్నా యి. ఏపీలో రూ.17.28 కోట్లు, తెలంగాణలో రూ. 30.68 కోట్లు చొప్పున పరిహారం ప్రకటించారు.
హైకోర్టులో కేసులకు రూ.5 కోట్లు పరిహారం
హైకోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 71 కేసులు పరిష్కారమయ్యాయి. మోటార్ వాహనాల కేసులు 26, భూసేకరణ, క్రిమినల్, ఇతర రిట్లు, ప్రాథమిక దశలోనే కేసుల పరిష్కారం చేయడం ద్వారా రూ.5 కోట్ల మేరకు పరిహారాన్ని ప్రకటించినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌లను నిర్వహించారు.
ఒక్క రోజు.. 42 వేల కేసులు!
Published Sun, Dec 10 2017 3:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment