లోక్‌ అదాలత్‌లో 25 వేల కేసులకు పైగా పరిష్కారం | Over 25,000 cases are settled in Lok Adalat | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 25 వేల కేసులకు పైగా పరిష్కారం

Published Sun, Sep 10 2017 3:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Over 25,000 cases are settled in Lok Adalat

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. 25 వేలకు పైగా పరిష్కారమైన కేసుల్లో రూ.45.56 కోట్లను పరిహారంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11,662 కేసులు పరిష్కరించి, రూ.19.31 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు తెలంగాణ న్యాయసేవాధి కార సంస్థ సభ్యకార్యదర్శి బి.ఆర్‌.మధుసూదన్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 13,938 కేసులు పరిష్కరించి, రూ.26.25 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్‌ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పి.వి.రాంబాబు వివరించారు.

ఇదిలాఉంటే ఉమ్మడి హైకోర్టులో జరిగిన లోక్‌ అదాలత్‌లో 78 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.3 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్య దర్శి ఎస్‌.వి.రమణమూర్తి తెలిపారు. లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్, టి.రజనీ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి.వి.సీతాపతిలు కేసుల విచారణలో పాలు పంచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement