సెజ్‌ బాధితులకు అండగా పోరాడతాం | will support SEZ victims | Sakshi
Sakshi News home page

సెజ్‌ బాధితులకు అండగా పోరాడతాం

Published Mon, Sep 12 2016 12:36 AM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

సెజ్‌ బాధితులకు అండగా పోరాడతాం - Sakshi

సెజ్‌ బాధితులకు అండగా పోరాడతాం

 
  •  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
కోట:
కర్లపూడి సెజ్‌ బాధితులకు అండగా నిలబడి పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఆదివారం కర్లపూడి గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కోస్టల్‌ కారిడార్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న భూములు వాటి స్థితిగతుల ఆధారంగా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారంగా చెల్లించాలన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో 11 వేల ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసిన విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమల కోసం గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, డివిజన్‌ కార్యదర్శి యాదగిరి, కోట మండల కార్యదర్శి పీవీ కృష్ణయ్య, కర్లపూడి సర్పంచ్‌ సన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి ఉన్నారు.
 
సెజ్‌లు, సీపీఎం మధు, కోట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement