ఆద్యంతం.. ఉత్కంఠభరితం | Volley ball tourney ends | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. ఉత్కంఠభరితం

Oct 10 2016 1:46 AM | Updated on Sep 4 2017 4:48 PM

ఆద్యంతం.. ఉత్కంఠభరితం

ఆద్యంతం.. ఉత్కంఠభరితం

గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి సహకారంతో నాలుగు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీ విభాగ సీనియర్స్‌ వాలీబాల్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి.

 
  •   ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు
  •  మహిళా విభాగంలో విన్నర్స్‌గా కృష్ణా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి
  • పురుషుల విభాగంలో విన్నర్స్‌గా వైజాగ్‌, రన్నర్స్‌గా కృష్ణా 
 
గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి సహకారంతో నాలుగు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీ విభాగ సీనియర్స్‌ వాలీబాల్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ప్రేక్షకులతో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్డేడియం కిక్కిరిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్పాన్సర్‌ కనుమూరు హరిచంద్రారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రారంభమైన మహిళా విభాగ పోటీలో కృష్ణా జిల్లా విన్నర్స్‌గా నిలవగా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో మూడు సెట్లలో కృష్ణా జట్టు ఆధిక్యతను నిలుపుకొంది. మూడో స్థానానికి జరిగిన పోరులో వైజాగ్‌, కర్నూలు జట్లు తలపడగా, మొదటి సెట్‌లో కర్నూలు విజయం సాధించింది. అనంతరం వరుసగా మూడు సెట్లలో విశాఖపట్నం విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్స్‌గా కృష్ణా జిల్లాలు నిలిచాయి. మూడో స్థానానికి జరిగిన పోటీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రకాశం గెలుపొందింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement