Volley ball tourney
-
విజేత రిసాలా బజార్ జట్టు
సాక్షి, హైదరాబాద్: అటల్ బిహారి వాజ్‌పేయ్ యూత్ ఫెస్ట్‌లో భాగంగా జరిగిన వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో రిసాలా బజార్ జట్టు ఆకట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌పోరులో రిసాలా బజార్ 25–20, 25–21తో ఎల్బీ స్టేడియంపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఎల్బీ స్టేడియం 25–18, 25–21తో వైఎంసీఏ నారాయణగూడపై, రిసాలా బజార్ 25–16, 25–18తో సరూర్నగర్పై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆద్యంతం.. ఉత్కంఠభరితం
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మహిళా విభాగంలో విన్నర్స్‌గా కృష్ణా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి పురుషుల విభాగంలో విన్నర్స్‌గా వైజాగ్, రన్నర్స్‌గా కృష్ణా గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి సహకారంతో నాలుగు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీ విభాగ సీనియర్స్ వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ప్రేక్షకులతో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్డేడియం కిక్కిరిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్పాన్సర్ కనుమూరు హరిచంద్రారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రారంభమైన మహిళా విభాగ పోటీలో కృష్ణా జిల్లా విన్నర్స్‌గా నిలవగా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో మూడు సెట్లలో కృష్ణా జట్టు ఆధిక్యతను నిలుపుకొంది. మూడో స్థానానికి జరిగిన పోరులో వైజాగ్, కర్నూలు జట్లు తలపడగా, మొదటి సెట్లో కర్నూలు విజయం సాధించింది. అనంతరం వరుసగా మూడు సెట్లలో విశాఖపట్నం విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్స్‌గా కృష్ణా జిల్లాలు నిలిచాయి. మూడో స్థానానికి జరిగిన పోటీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రకాశం గెలుపొందింది. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషులు, స్త్రీల వాలీబాల్ టోర్నమెంట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగాను 15 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో ఐదు కోర్టులు ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి పోటీల తరహాలో ఏర్పాట్లు, ప్రేక్షకులకు సీటింగ్ అరేంజ్మెంట్స్, రాత్రి వేళ పోటీలను నిర్వహించేందుకు అనువుగా ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. కోర్డు ప్రాంగణాలకు అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, భోజన వసతిని హరిచంద్రారెడ్డి ట్రస్ట్ తీసుకుంటోంది. క్రీడాకారుల్లో ఆసక్తి పెంపు -రవీంద్రబాబు, శాప్ డైరెక్టర్ గూడూరు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత క్రీడాకారుల్లో ఆసిక్తిని పెంపొందిచినట్లవుతుంది. జాతీయ స్థాయి పోటీలను తలపించేలా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది -కనుమూరు హరిచంద్రారెడ్డి , ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాష్ట్ర స్థాయి పోటీలను గూడూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఓజిలిలో జరిగిన సమ్మర్ క్యాంప్‌ను చూసినప్పటి నుంచీ ఇలాంటి టోర్నమెంట్‌ను గూడూరులో నిర్వహించాలనుకున్నా. ఇప్పటికి కార్యరూపం దాల్చింది. అనంతపురంలో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ను గూడూరులో జరిగేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఆదరణ పెరగాలి -కమలాకర్‌రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ వాలీబాల్ క్రీడకు ఇంకా ఆదరణ పెరగాలి. రాష్ట్రస్థాయి పోటీలను తిలకించడం ద్వారా క్రీడపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంత బడ్జెట్‌తో ఒకే స్పాన్సర్‌తో నిర్వహించడం ఇదే ప్రథమం.