
ప్రతీకాత్మకచిత్రం
గూడూరు (తిరుపతి): కూతురు స్నేహితురాలిపైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రెండవ పట్టణ ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపిన వివరాలివీ.. గూడూరు రూరల్ పరిధిలోని వేములపాళెంకు చెందిన వెంకటేశ్వర్లు ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న గూడూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక వెంకటేశ్వర్లు కుమార్తెకు స్నేహితురాలు. బుధవారం ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైంది.
అప్పటికే కుమార్తెను కళాశాలలో వదిలిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలతో రూరల్ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారు కాగా.. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment