గూడూరుకే గర్వకారణం...
గూడూరు: గూడూరు ప్రాంతానికి చెందిన చిన్నారి అమెరికాలో ప్రతిభ కనబర్చడం గూడూరుకే గర్వకారణమని డిస్కం డీఈ అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో ఆ చిన్నారిని బలిజ అభ్యదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునీతా సేవా సంస్థ నిర్వాహకులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మిల మనుమరాలు అయిన కాట్రాజు నవ్య అనే విద్యార్థిని అమెరికాలో సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇలా నవ్య వరుసగా మూడు పర్యాయాలు మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్‌కుమార్, సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవయ్య, ప్రతినిధులు మదనమేటి రమణయ్య, సారంగం శ్రీనివాసులు, రామకష్ణ, వెంకటేశ్వర్లు, రమేష్ పాల్గొన్నారు.