
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. గూడూరు డీఆర్‌డబ్యూ‍్ల ఎగ్జామ్ సెంటర్ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతి చెందిన విద్యార్థి సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తించారు.
చదవండి: (ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు)