
సాక్షి, హైదరాబాద్ : పరీక్ష హాల్‌లోనే ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి గుండె ఆగింది. వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లాకు చెందిన గోపీరాజు శనివారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో పరీక్ష రాస్తున్న అతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గోపిరాజును సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా గోపీరాజు ఓ ప్రయివేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment