ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు
గూడూరు: ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు పనిచేస్తున్నాయని ఆ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు, కర్నూలు పుల్లారెడ్డి కళాశాల అధినేత సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజీనిరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్‌టీయూ అనంతపూర్ పరిధిలో 141 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 11 కళాశాలలకు మాత్రమే అటానమస్ గుర్తింపు ఉందన్నారు. అటానమస్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు 80 నుంచి 90 మంది డాక్టరేట్స్, ప్రతి విభాగంలో ఒక ప్రొఫసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫసర్లను నియమించుకోవాలని సూచించారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని కోరారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ విషయంలో ఏకీకృత విధానాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ కార్యదర్శి, నంద్యాల ఆర్‌జీఎం కళాశాల చైర్మన్ శాంతిరాయుడు, అసోసియేషన్ వైస్ చైర్మన్, అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి, నేదురుమల్లి విద్యా సంస్థల చైర్మన్ రాంకుమార్‌రెడ్డి, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.