
మహిళపై కత్తితో దాడి: చైన్ స్నాచింగ్
(గూడూరు అర్బన్) నెల్లూరు : గూడూరు పట్టణ నడిబొడ్డున ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సుబ్బమ్మ(40) అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం మహిళ మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసుతో పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన సుబ్బమ్మను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.