![Road Accident On Gudur National Highway - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/4/Road-accident.jpg.webp?itok=H4YsMazA)
సాక్షి, నెల్లూరు: గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సింగిల్ రోడ్డు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment