రెండు లారీలు ఢీ
-
ఇద్దరికి గాయాలు
గూడూరు:
రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వివరాల మేరకు.. స్థానిక ఆదిశంకర కూడలి వద్ద బుధవారం విజయవాడ నుంచి కూరగాయల లోడుతో వస్తున్న లారీ గూడూరు పట్టణంలోకి మలుపు తిరుగుతుండగా, చెన్నై వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న లారీ వెనుకపైన ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నెల్లూరకు తరలించారు. ఎస్సై బాబి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను క్రేన్ సహాయంతో తొలగిస్తూండగా అది కూడా అదుపుతప్పి బోల్తాపడింది. అనంతరం మరో క్రేన్‌ను తెప్పించి వాటిని రహదారికి అడ్డులేకుండా తొలగించడంతో ట్రాఫిక్ సజావుగా సాగింది.