lorries collide
-
బోన్ క్యాన్సర్ అని తెలియడంతో...
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్ క్యాన్సర్ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు. భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు. (చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...) -
రెండు లారీలు ఢీ.. మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి
-
కడప జిల్లాలో మూడు లారీలు ఢీ
-
లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
అన్నానగర్: మరమ్మతుకు గురై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన క్రోంపేటలో శనివారం జరిగింది. చెన్నై సమీపంలోని తాంబరం నుంచి శనివారం కంకర రాళ్ల లోడుతో రెండు లారీలు పల్లావరం వైపు బయలుదేరాయి. క్రోంపేట బస్టాండ్ సిగ్నల్ సమీపంలో జీఎన్టీ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక ఉన్న లారీ ఢీకొంది. వెనుక లారీ ముందు భాగం ధ్వంసమవడంతో రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో మరైమలై నగర్ నుంచి వస్తూ క్రోంపేటలో కార్ల ఫ్యాక్టరీ కార్మికులను దింపి గిండి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైకుపై టీ విక్రయించే వ్యాపారిని ఢీకొని, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. దిండుగల్‌కు చెందిన కారు డ్రైవర్ సరన్రాజ్ (24), కారులో ముందు సీటులో కూర్చున్న ప్రైవేట్ సంస్థ సెక్యూరిటీ రాజేంద్రన్ (54)లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. టీ వ్యాపారి త్యాగరాజన్ (34) తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుడిని క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. -
రెండు ట్రాలీలు ఢీ- క్లీనర్ మృతి
కృష్ణపట్నంపోర్టు బైపాస్‌రోడ్డు (ముత్తుకూరు): ఆగి ఉన్న ట్రాలీని మరో ట్రాలీ ఢీకొనడంతో ఓ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని పంటపాళెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు..చీమకుర్తి నుంచి కృష్ణపట్నంపోర్టుకు గ్రానైట్ రాళ్లలో ట్రాలీ బయలుదేరింది. పోర్టు బైపాస్‌రోడ్డులోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ట్రాలీని రోడ్డు వైపు నిలిపి, డీజల్ కోసం డ్రైవర్ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో చీమకుర్తి నుంచి వస్తున్న మరో గ్రానైట్ లోడు ట్రాలీ వేగంగా ఆగి ఉన్న ట్రాలీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులోని ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం, కోళ్లబీమునిపాడుకు చెందిన క్లీనర్ సత్తెనపల్లి పిచ్చయ్య (25) రాళ్ల కింద నలిగి, మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు. వారం క్రితమే పనిలో చేరాడు మృతి చెందిన పిచ్చయ్య వారం క్రితమే ఈ ట్రాలీలో క్లీనర్‌గా చేరాడు. ఈ ప్రమాదంలో వెనుక ట్రాలీలోని గ్రానైట్ బండరాళ్లు కిందపడ్డాయి. పోర్టు సెక్యూరిటీ గార్డులు క్రేన్ ద్వారా పిచ్చయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. బండరాళ్లను మరో ట్రాలీలో పోర్టుకు తరలించారు. ఈ ప్రమాదానికి భయపడి డీజల్ కోసం వెళ్లిన మరో ట్రాలీ డ్రైవర్ కూడా పరారయ్యాడు. పిచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రెండు లారీలు ఢీ
ఇద్దరికి గాయాలు గూడూరు: రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వివరాల మేరకు.. స్థానిక ఆదిశంకర కూడలి వద్ద బుధవారం విజయవాడ నుంచి కూరగాయల లోడుతో వస్తున్న లారీ గూడూరు పట్టణంలోకి మలుపు తిరుగుతుండగా, చెన్నై వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న లారీ వెనుకపైన ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నెల్లూరకు తరలించారు. ఎస్సై బాబి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను క్రేన్ సహాయంతో తొలగిస్తూండగా అది కూడా అదుపుతప్పి బోల్తాపడింది. అనంతరం మరో క్రేన్‌ను తెప్పించి వాటిని రహదారికి అడ్డులేకుండా తొలగించడంతో ట్రాఫిక్ సజావుగా సాగింది.