రెండు ట్రాలీలు ఢీ- క్లీనర్ మృతి
రెండు ట్రాలీలు ఢీ- క్లీనర్ మృతి
Published Thu, Dec 1 2016 1:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
కృష్ణపట్నంపోర్టు బైపాస్‌రోడ్డు (ముత్తుకూరు): ఆగి ఉన్న ట్రాలీని మరో ట్రాలీ ఢీకొనడంతో ఓ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని పంటపాళెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు..చీమకుర్తి నుంచి కృష్ణపట్నంపోర్టుకు గ్రానైట్ రాళ్లలో ట్రాలీ బయలుదేరింది. పోర్టు బైపాస్‌రోడ్డులోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ట్రాలీని రోడ్డు వైపు నిలిపి, డీజల్ కోసం డ్రైవర్ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో చీమకుర్తి నుంచి వస్తున్న మరో గ్రానైట్ లోడు ట్రాలీ వేగంగా ఆగి ఉన్న ట్రాలీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులోని ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం, కోళ్లబీమునిపాడుకు చెందిన క్లీనర్ సత్తెనపల్లి పిచ్చయ్య (25) రాళ్ల కింద నలిగి, మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు.
వారం క్రితమే పనిలో చేరాడు
మృతి చెందిన పిచ్చయ్య వారం క్రితమే ఈ ట్రాలీలో క్లీనర్‌గా చేరాడు. ఈ ప్రమాదంలో వెనుక ట్రాలీలోని గ్రానైట్ బండరాళ్లు కిందపడ్డాయి. పోర్టు సెక్యూరిటీ గార్డులు క్రేన్ ద్వారా పిచ్చయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. బండరాళ్లను మరో ట్రాలీలో పోర్టుకు తరలించారు. ఈ ప్రమాదానికి భయపడి డీజల్ కోసం వెళ్లిన మరో ట్రాలీ డ్రైవర్ కూడా పరారయ్యాడు. పిచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement