చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
-
ఎస్పీ విశాల్ గున్నీ
-
అట్టహాసంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
గూడూరు: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ విశాల్‌గున్నీ పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను గురువారం ఎస్పీ ప్రారంభించారు. తొలుత స్పోర్ట్స్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. కేరళ యువతుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు గూడూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. అనంతరం వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణారావు, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి , ఎన్‌బీకేఆర్ విద్యా సంస్థల అధినేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మునిగిరీష్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపాల్‌రావు, రొటేరియన్లు కేఎస్‌రెడ్డి, జానకిరాంరెడ్డి, సురేంద్రరెడ్డి, దయాకర్‌రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, లక్ష్మీ పీఎంరావు, తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం జట్టు, విశాఖపట్నంపై ప్రకాశం, గుంటూరుపై అనంతపూర్ జట్లు విజయం సాధించాయి. అలాగే స్త్రీల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జట్టు , తూర్పు గోదావరిపై పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించాయి.