YS Jagan Mohan Reddy Birthday Special: చదువుతో పాటు ఆటలూ ముఖ్యమే. చిన్న వయసు నుంచే క్రీడల్లో భాగమవడం వల్ల మనోల్లాసం లభించడంతో పాటు.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా పాఠశాల స్థాయి నుంచే ఆటల పట్ల మక్కువ ఎక్కువ. క్రికెట్ ఆడటం అంటే ఆయనకు చాలా ఇష్టం.
హౌజ్ కెప్టెన్‌గా
అంతేకాదు.. స్కూల్ లెవల్లో వైస్ జగన్ బాస్కెట్ బాల్ కూడా ఆడేవారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించేవారు. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా జగన్ అరుదైన ఘనత సాధించారు.
పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీల్లోనూ తమ జట్టును విజయపథంలో నిలిపి టైటిల్ కైవసం చేసుకున్నారు.
మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు
ఇక క్రీడల్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వతహాగా తెలుసు కాబట్టే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. తన హయాంలో విద్యతో పాటు క్రీడా రంగానికీ పెద్దపీట వేశారు. ప్రతిభ ఉండి వెలుగులోకి రాని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
కేవలం రాష్ట్ర స్థాయిలోనే గాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా జగన్ ప్రభుత్వం ఈ మేర ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) వంటి ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఆహ్వానించింది.
ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కె.పవన్ అనే యువకుడిని సీఎస్‌కే దత్తత తీసుకోవడం విశేషం. విజయనగరం జిల్లాలోని జామి మండలం అలమండకు చెందిన పవన్ అలా ఐపీఎల్‌కు చేరువయ్యాడు. ఇక ఆడుదాం ఆంధ్రాతో పాటు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్‌ను కూడా ప్రతిష్టాత్మంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం.
ఆంధ్ర ప్రీమిర్ లీగ్ హిట్
వైఎస్ జగన్ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ‘ఆంధ్ర ప్రీమిర్ లీగ్’ పేరిట పోటీలు మొదలుపెట్టింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతోంది. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఏపీఎల్‌తో జోనల్ స్థాయి క్రికెటర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment