అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి | ysrcp mla kakani speaks over corruption in ap | Sakshi
Sakshi News home page

అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి

Published Thu, Jun 16 2016 9:41 AM | Last Updated on Mon, Oct 29 2018 8:27 PM

అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి - Sakshi

అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి

గూడూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు  రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నామనీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.  వరిగొండ పంచాయతీలో ఎన్‌డీఆర్ అధినేతలు నిర్మించిన రెండు ఆర్వోప్లాంట్లను, ఎంపీ నిధులతో నిర్మించిన ఓ సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే కాకాణి బుధవారం ప్రారంభించారు. 

అనంతరం స్థానిక పంచాయతీ కార్యాయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డుకొంటున్నారనీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేక ప్రజ లకు ఏం సమాధానం చెప్పలేక సీఎం, ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.లక్ష కోట్లు అయి నా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటిం చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీలను కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేకపోయారన్నా రు.

ఇంటింటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయో చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పింఛన్లను, ఇళ్లను, ఇతర పథకాలను సొంత పార్టీ కార్యకర్తలకే దోచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గచర్య అన్నారు.  గతంలో ఎమ్మెల్యేలకు ఏడాదికి రూ.కోటి నిధులు మంజూరు అయ్యేవన్నారు.కాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆ నిధులను సై తం నిలిపి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.  ప్రజా సమస్యలను గాలికొదిలి అక్ర మ సంపాదనే ధ్యేయం తో ముందుకు సాగుతున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హ త ఇక ఎంత మాత్రం లేదన్నారు.ఏరోజు ఎ న్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారాన్ని సాధించడం ఖాయమని కాకాణి స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడుమన్నెం చిరంజీవులగౌడ్, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఎంపీటీసీ సభ్యులు కమతం సునీత, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి సుధీర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దిలీప్‌రెడ్డి, మండల కన్వీనర్  పద్మనాభరెడ్డి,ఎన్‌డీఆర్ అధినేతలు ఆదికేశువులరెడ్డి,  అమృతేష్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి,  శ్యామలమ్మ, సురేష్‌రెడ్డి,  రామ్మూర్తి,  సుబ్బారావు, శంకరయ్యగౌడ్, జితేంద్రరెడ్డి, శేషమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement