
చిన్నబాబు డైరెక్షన్.. చంద్రబాబు యాక్షన్‌లో దోపిడీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం కాకాని మీడియాతో మాట్లాడారు. 11 వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను రూ. 24వేల కోట్లుకు ఎందుకు పెంచారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
చిన్నబాబు డైరెక్షన్‌లో చంద్రబాబు యాక్షన్‌లో దోపిడీలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. గాలేరి-నగరి ప్యాకేజీలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు 12 కోట్ల రూపాయల వర్కును 115 కోట్ల రూపాయలకే ఎలా పెంచారని కాకాని గోవర్థన్ రెడ్డి విమర్శించారు.