Madhya Pradesh: The Kerala Story Movie Makes Woman File FIR Against Her Lover - Sakshi
Sakshi News home page

'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ

Published Tue, May 23 2023 7:30 AM | Last Updated on Tue, May 23 2023 9:16 AM

After Fight Over The Kerala Story Women Case Filed Her Boyfriend - Sakshi

ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్‌ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్‌ కేర్‌ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది.

ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ‍ప్రకారం..మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్‌ఐర్‌ నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్‌ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

(చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement