Odisha Food Delivery Boy Thrashes Girl For Abusing Boyfriend, Video Viral - Sakshi
Sakshi News home page

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఎంట్రీతో సీన్‌ రివర్స్‌

Published Fri, Apr 1 2022 11:57 AM | Last Updated on Mon, Apr 4 2022 12:06 PM

Viral Video Shows Food Delivery Executive Thrashing A Girl  - Sakshi

Food delivery boy intervenes in lovers spat: ఎక్కడైన ఏదైనా గొడవ జరుగుతుంటే సర్ది చెప్పి గొడవ ఆపేందుకు లేదా సద్దుమణిగేలా చేయడం సహజం. అయితే అలాంటి ఘటనల్లో ఒక్కోసారి మంచి చేద్దామని జోక్యం చేసుకున్నందుకు వాళ్లపైనే తిరగబడిన వాళ్లు ఉంటారు. ఏది ఏమైన ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగానే హ్యండిల్‌ చేయాలి లేదంటే మంచికిపోతే చెడు ఎదురైందన్న సామెత మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఒడిశాలో భువనేశ్వర్‌లోని ఇందిరాగాంధీ పార్క్‌ వెలుపల ఒక అమ్మాయి తన ప్రియుడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను తిట్టడం కొట్టడం వంటివి చేసింది. ఇంతలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేద్దామనుకుంటాడు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది.

ఇప్పుడూ ఆ అమ్మాయి ఆ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని భయంకరంగా తిట్టడం మొదలు పెట్టింది. ఇక సహనం కోల్పోయిన ఆ వ్యక్తి  ఆ అమ్మాయిపై చేయి చేసుకుంటాడు. దీంతో అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా షాకై పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఆ అమ్మాయి గానీ ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో డీసీపీ ఉమాశంకర్ దాష్ ఆ ఇద్దరి పై కేసు నమోదు చేయమని సంబంధిత పోలీసులను ఆదేశించారు.

(చదవండి: చెడు అలవాట్లకు బానిసై... ఆ వ్యక్తి 14 ఏళ్లుగా అక్కడే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement