మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని సంతోషం వస్తుంది. వాళ్లను చూడగానే హయ్ అని పలకరించడం లేదా కరచలనం చేయడం వంటి పనులు చేస్తాం. బాగా నచ్చిన వాళ్లయితే వెంటనే వాళ్లను హగ్ చేసుకోవడం వంటివి చేయడం సహజం. అచ్చం అలానే ఇక్కడొక ఆమె అత్యుత్సహంతో పరిగెట్టి అబాసుపాలైంది.
వివరాల్లోకెళ్తే...ఒక అమ్మాయి తన భర్తను ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవానిడానికి వస్తుంది. ఐతే చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటున్నారు. దీంతో ఆమె ఎయిర్ పోర్ట్‌లో తన భర్త కనిపించగానే ఆనందంతో హగ్ చేసుకోవడానికి పరిగెట్టింది. అచ్చం సినిమాలోని హిరోయిన్ మాదిరి పరిగెడుతుంది. ఇంతలో అనుకోకుండా భర్త స్లిప్ అయి కిందపడిపోవడంతో వేగంగా వస్తున్న ఆమె కూడా భర్తని గుద్దుకుని పడిపోతుంది.
ఈ హఠాత్పరిణామానికి అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు షాక్ అవుతారు. ఆ జంటకు సాయం చేసేందుకు అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు రాకమునుపే వారికివారే సర్దుకుని లేగిసిపోవడం జరిగిపోతుంది. పైగా సదరు మహిళ జంప్త చేసి మరీ తన భర్తను గట్టిగా ప్రేమతో ఆలింగనం చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజనల్లు మొదట ఆ జంటకు మంచి చెప్పులు కొనివ్వాలి ఇలా పడిపోకుండా ఉండేందుకుని అని కామెంట్లు చేస్తు ట్వీట్ చేశారు.
'Falling' in love!
— Harpreet (@CestMoiz) August 8, 2022
😂 pic.twitter.com/1m2Ojg2uOY
(చదవండి: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..)
Comments
Please login to add a commentAdd a comment