వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! | UP Girl Save Self Toddler From Monkey Attack with Alexa | Sakshi
Sakshi News home page

వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!

Published Sat, Apr 6 2024 11:54 AM | Last Updated on Sat, Apr 6 2024 12:43 PM

UP Girl Save Self Toddler From Monkey Attack with Alexa - Sakshi

 తెలివిగా వ్యవహరించి చెల్లెల్ని, తననూ కాపాడుకున్న బాలిక

పిల్లలు గాడ్జెట్స్‌ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించా లేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు.  సమయానికి వాడుతారు కూడా. యూపీలో జరిగిన ఒక సంఘటన చూస్తే మీరూ నిజం అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్‌గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు ,  నెలల వయస్సున్న చెల్లెల్ని కూడా  రక్షించు కుంది.  


ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివసించే 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే... కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు.  ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న  సమయంలో ఇంట్లోకి  కోతులు చొరబడ్డాయి. వంటగదిలోకి వెళ్లి,   వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి. ఇది చాలదన్నట్టు  చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి.  కుటుంబ సభ్యులంతా పై అంతస్థులో వేరే గదిలో ఉన్నారు. అయినా నిఖిత తల్లిని పిలవడానికి ప్రయత్నించింది. కానీ అవి మరింత రెచ్చిపోయాయి. ఇక్కడే నిఖిత తెలివిగా ఆలోచించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా  మొరగాలని అలెక్సాను ఆదేశించింది. అంతే  అమెజాన్‌ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పెద్దగా మొరిగే శబ్దాలు చేసింది. దీంతో  కోతిని భయపడి పారిపోయింది. 

“కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు, వారు గేటు తెరిచారు. దీంతో కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను  విసిరి పారేశాయి. ఇద్దరమూ భయపడ్డాం. అప్పుడు కుక్క  మొరిగే శబ్దాలను  ప్లే చేయమని అలెక్సాను అడిగాను.  అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి”  అని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్‌ఐతో వివరించింది.  ఈ గలాటా అంతా వినబడి తానూ  వచ్చాననీ, అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాని నిఖిత తల్లి చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement