మార్మోగిన గోవింద నామం
పోటెత్తిన భక్తులు
ఘనంగా పండిత సదస్యం
వాడపల్లి (ఆత్రేయపురం) : ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యం ప్రాంగణం ఆదివారం గోవింద నామస్మరణతో మారుమోగింది. పండిత సదస్యం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించుకున్నారు. స్వామికి వేకువ జామునే గ్రామోత్సవం నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదపారాయణంతో స్వామికి వేదాశీర్వచనం అందజేశారు. సుప్రభాత సేవ, బాలభోగం, విష్వక్సేనపూజ, వేదపారాయణ, నివేదన, బలిహరణ, దివ్య ప్రబంధం వంటి కార్యక్రమాలను వేదపండితులు, అర్చక స్వాములు వేద మంత్రాల పఠనతో నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పవళింపు సేవ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, సభ్యులు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.