ఘనంగా పవిత్రోత్సవాలు
-
భక్తులతో శోభిల్లిన వాడపల్లి దివ్యక్షేత్రం
వాడపల్లి(ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండోరోజు ఆదివారం ఘనంగా జరిగాయి. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. ఉదయం స్వామివారిని ప్రత్యేక పువ్వులతో అలంకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో రాధాకృష్ణా, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.