venkateswar swamy
-
అశ్వవాహనంపై కల్కి అవతారంలో కొలువుదీరిన శ్రీవారు!
తనువును పులకరింపజేసే మలయమారుతాలు.. మనసుని పరవశింపజేసే గోవిందనామాలు.. ఆధ్యాత్మికానుభూతిని ఇనుమడింపజేసే జీయ్యంగార్ల గోష్టిగానాలు.. శ్రవణానందకరంగా మంగళవాయిద్యాలు.. కనులపండువగా కళాబృందాల నృత్యాభినయాలు.. ఠీవిగా ముందుకేగుతున్న గజరాజులు.. అడుగడుగునా కర్పూరహారతుల నడుమ ఉభయదేవేరీ సమేతంగా మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై దివ్యతేజోవిరాజితంగా దేవదేవుడు విహరిస్తూ భక్తులకు సకల శుభాలను అనుగ్రహించారు. కలి దోషాలను నివారించే కల్కి అవతారంలో అశ్వవాహనం అధిరోహించి సమస్త జీవకోటిని కటాక్షించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ మాడవీధుల్లో విహరించారు. ఈ క్రమంలోనే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కనులపండువగా అశ్వవాహన సేవ నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకారంలో అశ్వంపై కొలువుదీరి భక్తజనులను అనుగ్రహించారు. వాహనసేవల్లో టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రసాన్నం, రాత్రి ధ్వజారోహణంతో పరిపూర్ణంకానున్నాయి. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వరాహస్వామివారి ఆలయం వద్ద పుష్కరిణిలో ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం జరిపించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. (చదవండి: మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!!) -
బంగారు పూలు నాకెందుకు!
‘‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు /కొండలంత వరములు గుప్పెడువాడు’’. ఆ కొండలు ఈనాటి కొండలు కావు. అసలు ఆ కొండలే వేంకటేశ్వరుడంటారు. అందుకనే ఆ కొండ పాదాన్ని స్వామి పాదుకలుగా భావించి అర్చన చేస్తారు. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, నారాయణాద్రి– అవి ఏడు కొండలు. ఒక్కొక్క కొండ ఎందుకొచ్చిందో ఆ విశేషాల్ని వరాహ పురాణం వర్ణించింది. అది –‘‘కృతే వృషాద్రిం వక్ష్యంతి/త్రేతాయాం అంజనాచలమ్ /ద్వాపరే శేషశైలతే /కలౌ శ్రీ వేంకటాచలమ్.’’ కృత యుగంలో వృషాద్రి అని, త్రేతా యుగంలో అంజనాద్రి అని, ద్వాపర యుగంలో శేషాద్రి అని, కలి యుగంలో వేంకటాద్రి పేరిట ఈ దివ్య క్షేత్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికీ వేంకటాచలంపైన శిలాతోరణం ఉంది. అది ఎప్పటిదో ఎవ్వరికీ తెలియదు. దానంతట అదిగా ఏర్పడింది. అది క్రీడాద్రి. శ్రీమన్నారాయణుడు విహరించిన ఉద్యానవనం. దానిని గరుడుడు తీసుకొచ్చి భూమిమీద పెట్టాడు.ఇక కోనేరు–దానిని స్వామి పుష్కరిణి అంటాం. మనకు జీవితంలో మూడే మూడు దుర్లభమయినవని వరాహ పురాణం చెబుతున్నది. ఈ మూడింటిలో ఏదయినా నీకు దొరికితే నీవు అదృష్టవంతుడి కింద లెక్క. అవి– ‘సద్గురోః పాదసేవనం’. సర్వకాలాల్లో భగవంతుని పాదారవిందాలనుంచీ స్రవించే అమృతపానంతో మత్తెక్కిపోయిన హృదయమున్న పరమ భాగవతుడైన జ్ఞాని పాదసేవ అంత సులభం కాదు. సమస్త తీర్థాలు అటువంటి గురువు పాదాలలో ఉంటాయి. అలాగే ఏకాదశీ వ్రతాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయడం చాలా కష్టం. ఇక మూడవది–పుష్కరిణీ స్నానం. ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు... అక్కడ స్నానం చేస్తే అకాల మృత్యువు, మతి భ్రమణం ఇతర అనారోగ్యాలు దరి చేరవంటాడు. అందులో కొన్ని వందల తీర్థాలు అంతర్వాహినిగా కలుస్తుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి, భూదేవిలతో కలిసి జలకాలాడిన పరమ పావనమైన పుష్కరిణీ స్నానం విశేషమైనది. దానికి రాయడు అంటే రాజు అటువంటి దుర్లభమైన పుష్కరిణీ స్నాన అవకాశాన్ని మనకు కలిగించాడు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడైనాడు.కొండలంత వరములు గుప్పెడు వాడు..వాడు కొండలలో ఉన్నాడు. సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం. ఆయనేం ఇవ్వలేడు కనుక. కొండంత ఇచ్చేస్తాడు–అని. ఆయన ఏదయినా ఇవ్వగలడు, కరుణా సముద్రుడు. ఎవరయినా ఏదయినా ఇస్తారు. తనదే ఇవ్వమంటే తనకున్న స్థితి నుంచి కిందకొచ్చి ఇవ్వలేరు. అలా భక్తికి ఎంతగా పరవశించిపోతాడో చూపడానికి అన్నమాచార్యులవారు తన కీర్తనలో..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు. దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అన్నాడు. శ్రీవేంకటాచలం క్షేత్రానికి దగ్గరలో కుండలు చేసుకుంటూ జీవనం సాగించే భీముడనే కుమ్మరి.. స్వామివారి భక్తుడు. తన పూరి గుడిసెలోనే ఒక మూలన స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకుని తాను కుండలు చేసే ముందు మట్టితో చేసిన తులసీదళాలను స్వామి వారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. ‘బంగారు దళాలతో పూజచేసే తొండమాన్ చక్రవర్తి అహంకారాన్ని అణచడానికి, నిస్వార్థంగా, పారవశ్యంతో పూజించే భీముడింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించావు. ఎంత దయాసముద్రుడివయ్యా’– అని పొంగిపోతూ కీర్తన చేసారు అన్నమయ్య. స్వామికి కావలసింది బంగారు పుష్పాలు కాదు, హృదయ పుష్పాలు. -
‘ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలి’
సాక్షి, కడప : ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలని ఆలయాల సంరక్షణ సంధాన కర్త రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుని కడపలోని వెంకటేశ్వరస్వామి ఆలయంపై టీటీడీ అధికారులు చిన్న చూపు మానుకోవాలన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అర్చకులకు జీత భత్యాలు తక్కువగా ఇవ్వడం అన్యాయం అన్నారు. సంభావన తక్కువ ఉన్న వారికి జీతం కూడా తక్కువ ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. టీటీడీలో ఈఓల పెత్తనం తగ్గాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేశారు. వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలని కొనసాగించాలని కోరారు. -
వెంకన్న చౌదరిపై మురళీమోహన్ వివరణ
-
ఘనంగా పవిత్రోత్సవాలు
భక్తులతో శోభిల్లిన వాడపల్లి దివ్యక్షేత్రం వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండోరోజు ఆదివారం ఘనంగా జరిగాయి. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. ఉదయం స్వామివారిని ప్రత్యేక పువ్వులతో అలంకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో రాధాకృష్ణా, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.