దామరచర్ల: నల్లగొండ జిల్లాలోని దామరచర్ల నుంచి వీర్లపాలెం వరకు వేస్తున్న డబుల్ రోడ్డును ఆర్‌అండ్‌బీ సీఈ గణపతి రెడ్డి బుధవారం పరిశీలించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద రూ.9 కోట్లతో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీఈ నాణ్యత విషయాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అధికారులను ఆదేశించారు.