
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు.
హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు.
లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్‌ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment