Stranger
-
బీజేపీ ఎమ్మెల్యే ఆఫీసులోకి అగంతకుడు.. ఉదయాన్నే మరణం
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ కార్యాలయంలోకి గుర్తుతెలియని అగంతకుడు చొరబడ్డాడు. అతన్ని అక్కడున్న సిబ్బంది బలవంతంగా బయటకు గెంటేశారు. అయితే, మంగళవారం ఉదయం ఆ అగంతకుడు మృతదేహంగా తేలాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. కోయంబత్తూరు, హొసూరు రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ కార్యాలయం ఉంది. సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆ కార్యాలయంలోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు. లోనికి రాగానే గడియ పెట్టే ప్రయత్నంచేశాడు. దీనిని గుర్తించిన అక్కడి సిబ్బంది విజయ్ అతడిని పట్టుకున్నాడు. బలవంతంగా బయటకు తీసుకొచ్చి రోడ్డులో తోసేశాడు. ఈ అగంతకుడి చొరబాటుపై రేస్‌కోర్సు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితులలో మంగళవారం ఉదయం అదే అగంతకుడు మృతదేహంగా తేలాడు. అన్నాసాలై సిగ్నల్ వద్ద అతడి మృతదేహం బయట పడింది. గుర్తుతెలియని వాహనం ఏదేని ఢీకొట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇదే వ్యక్తి వానతీ శ్రీనివాసన్ కార్యాలయంలోకి చొరబడిన దృష్ట్యా విచారణను వేగవంతం చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. తన కార్యాలయంలోకి ఎందుకు చొరబడ్డాడో పోలీసులే తేల్చాలన్నారు. అతడు పూర్తిగా మత్తులో ఉన్నట్టు తన సిబ్బంది పేర్కొన్నారని, పోలీసులకు తాము అప్పుడే ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఈ అగంతకుడి వివరాలు తెలియక పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అతడి మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. -
ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..
పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు. హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు. ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్గాంగ్లోనో ఓ ప్లే గ్రౌండ్లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు. ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Dad violently knocks around a stranger’s kid at a playground 😳 pic.twitter.com/wBhBwJkMWj — Daily Loud (@DailyLoud) May 20, 2023 (చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది) -
ఈరోజుల్లో ఇలాంటి నిజాయితీపరులు ఉన్నారా?
ఓ గుర్తుతెలియని వ్యక్తి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసి తనవంతు సాయంగా రూ.201 సాయం చేశాడు కమల్ సింగ్ అనే యువకుడు. గతేడాది జూలై 7న ఫోన్ పే ద్వారా సాయం అందించాడు. ప్రస్తుతం ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఇతడు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. అయితే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అతని ఫోన్‌పేలోకి రూ.201కి వచ్చాయి. ఈ నంబర్ ఎవరిదా అని చూడగా.. గతంలో ఓ తల్లికి చికిత్స కోసం సాయం చేసిన విషయం గుర్తుకువచ్చింది. ఆమె కుమారుడే ఇప్పుడు డబ్బు తిరిగి పంపాడు. అమ్మ ఎలా ఉందని అడగ్గా.. బాగుందని బదులిచ్చాడు సాయం పొందిన వ్యక్తి. అంతేకాదు తన వ్యాపారం ఇప్పుడు బాగా సాగుతోందని, అందుకే తన తల్లికి వైద్యం కోసం సాయం చేసిన వారందరికీ తిరిగి డబ్బులు పంపిస్తున్నాని చెప్పాడు. అంతా మనీ మైండెడ్ మనుషులున్న ఈరోజుల్లో ఇంకా ఇలాంటి నిజాయితీపరులు ఉన్నారా? అని కమల్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్లో షేర్ చేసి అతడ్ని ప్రశంసించాడు. తల్లి చికిత్సకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని ఇప్పుడు అందరికీ తిరిగి చెల్లిస్తున్న కూమారుడ్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని నిజాయితీ, మంచి మనసును చూసి శభాష్ అంటున్నారు. చదవండి: ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా! -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...) -
వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!
ధర్మవరం రూరల్(శ్రీ సత్య సాయి జిల్లా): చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాం. అయితే ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తుండం గమనార్హం. సమాధిపైన చనిపోయిన వారి చిత్రం.. 45 ఏళ్ల క్రితం బళ్లారి ప్రాంతం నుంచి ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామానికి పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబీకులు.. పూడ్చిన చోటనే గంగమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు. పెద్ద బొమ్మయ్య సమాధిపై ప్రతిష్టించిన గంగమ్మ దేవత విగ్రహాలు అనంతరం వాటిపై చిన్నదేవాలయం లాంటి నిర్మాణమో.. లేకుంటే పూడ్చిన వ్యక్తి చిత్రాన్నో దానిపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చిన్నచిన్న ఆలయాలు కట్టిన ఆలయాలు నాలుగుదాకా ఉన్నాయి. ఇక.. సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ పూరీ్వకుడు బొమ్మయ్యే పేరు కొనసాగిస్తుండడం. ప్రస్తుతం గ్రామంలో చిన్న బొమ్మయ్య, పెద్ద బొమ్మయ్య, నడిపి బొమ్మయ్య, సన్న బొమ్మయ్య ఇలా మగవాళ్ల పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి. తాతల కాలం నుంచి అఖండం వెలుగుతోంది మేమంతా పూరీ్వకులను పూజిస్తుంటాం. వారి జ్ఞాపకార్థం సమాధులను నిర్మించి వాటిపై ప్రతిమలు ఏర్పాటు చేయించి పూజలు చేస్తాం. సమాధిపై నిర్మించిన గంగమ్మ గుడిలో మా తాతలు పెట్టిన అఖండం నేటికీ వెలుగుతోంది. కేవలం ఒత్తులు మాత్రమే మారుస్తుంటాం. ఆచారాన్ని మా పిల్లలకు కూడా నేర్పుతాం. – చిన్నబొమ్మయ్య, సుబ్బరావుపేట -
మేడం..! ఈ పర్స్ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్ అదే..
చాలాసార్లు పొరపాటునో లేక హడావిడిగా వెళ్లాల్సిరావడం వల్లనో మనం వ్యాలెట్ లేదా సెల్‌పోన్ వంటి విలువైన వస్తువులను మరిచిపోవడం జరుగుతోంది. ఇక ఒకవేళ ఏదైన వస్తువు పోతే ఇక అంతే! దొరికితే మాత్రం అదృష్టంగానే భావిస్తాం. చాలా మటుకు ఎవరో మంచివాళ్లయితే గానీ అంతలా పనిగట్టుకుని తీసుకురారు. అచ్చం అలాంటి ఒక మంచి పని అమెరికాలోని ఒక వ్యక్తి చేసి అందరిచే ప్రశంలందుకున్నాడు. (చదవండి: అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు) అసలు విషయంలోకెళ్లితే..యూఎస్‌లోని ఒక వ్యక్తి మేడమ్ మీ పర్స్ పోయింది అంటూ కిమ్ అనే మహిళ ఇంటి తలుపుకొడతాడు. ఆమె ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్లుగా చూస్తూ.. అది తన పర్సు కాదని చెబుతూ తలుపు వేసేయాలనుకుంటుంది. కానీ అతను పర్సు ఓపెన్ చేసి మేడం ఇది మీదే అంటూ అందులోని బ్యాంక్ కార్డులు అవి చూపిస్తాడు. ఇక అంతే కిమ్ ఒక్కసారిగా ఓ మై గాడ్ అని అరుస్తూ అది తన కూతురి వ్యాలెట్ అని ఒప్పుకోవడమే కాక ఆశ్చర్యంగా ఫీలవుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ప్రపంచంలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారంటూ రకరకాలుగా కిమ్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) View this post on Instagram A post shared by Ring (@ring) -
రూపాయి ఎర వేసి... ఖాతా ఖాళీ చేసి!
ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్న కె.పవిత్ర బ్యాంకు ఖాతాలో ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఖాతా నుంచి రూ.1 జమ అయ్యింది. మరుక్షణమే ఆ అపరిచిత వ్యక్తి తిరిగి రూ.1 రివర్స్ చేసుకున్నాడు. ఇలా నాలుగుసార్లు వేసి.. తీసిన తర్వాత ఒక్కసారిగా రూ.7,900 డ్రా చేశాడు. మళ్లీ అదే పనిగా మరో రూ.1,100ను నాలుగు దఫాలుగా విత్‌డ్రా చేశాడు. అయితే ఖాతాదారుకు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్, మెసేజ్ ఏదీ లేదు. ఏదో అవసరం మీద తన ఖాతాలో నగదును పరిశీలిస్తే.. ఈ విత్‌డ్రా పర్వం వెలుగు చూసింది. వెంటనే ఎల్బీ నగర్‌లోని సైబర్ క్రైమ్ విభాగంలో, తర్వాత బ్యాంకులో ఫిర్యాదు చేయగా... తమ పొరపాటు కాదని బ్యాంకర్లు చేతులెత్తేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండా, కనీసం తన పొరపాటు లేకుండా నగదు పోవడంతో ఆమె బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో నేరగాళ్లు ఇదే పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా ఏటీఎం వివరాలు అడగడమో, లేక ఎస్ఎంఎస్లు పంపమనడమో, ఏదో లింక్ పంపి క్లిక్ చేయమనడమో జరిగేది. అలా అవతలి వ్యక్తులు వివరాలు తీసుకున్న తర్వాత ఖాతాలో నగదు స్వాహా చేయడం విన్నాం. కానీ ఎలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేకుండా ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ విభాగానికి ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయి. గత వారం సంగారెడ్డిలోని ఓ టీచరు ఖాతా నుంచి ఏకంగా 20వేలు ఇలా మాయమయ్యాయి. ఇన్సూరెన్స్‌తో కవరేజీ... బ్యాంకు ఖాతాలో నగదుపోతే వెంటనే బ్యాంకర్‌కు ఫిర్యాదు చేయాలి. వారి సూచనల ఆధారంగా.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏటీఎం కార్డుకు ఇన్సూరెన్స్ ఉంటే పొగొట్టుకున్న మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఫిర్యాదు అనంతరం కార్డుదారు డాటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖాతాదారు పొరపాటు లేదని గ్రహిస్తేనే ఇన్సూరెన్స్ వస్తుంది. ఖాతాదారు తన వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకుంటే లేదా నగదు పొగొట్టుకోవడంలో తన ప్రమేయం ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 21న కె. పవిత్ర ఖాతాలో రూ.9వేలు స్వాహా కావడంపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రమేయం లేకుండా నగదు విత్‌డ్రా చేయడంపై ఆమె బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అప్రమత్తత లేకుంటే అంతే బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడం అంత సులువైన విషయం కాదు. ఖాతా వివరాలు తెలిసి ఉండటంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఏటీఎం కార్డు నంబర్‌తో పాటు సీవీవీ నంబర్లు తెలిస్తే చాలు మన ఖాతాలో నిల్వలు కొట్టేయొచ్చు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన తర్వాత వచ్చే స్లిప్పు ఆధారంగా కూడా తస్కరించవచ్చు. బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు ఇతరులకు ఇవ్వొద్దనే దానిపై ఖాతాదారుల్లో కొంత అవగాహన పెరిగింది. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఖాతాదారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీ ఎంలలో నగదు విత్‌డ్రా, ఇతర షాపింగ్ మాల్స్ లేదా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేశాక డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, లేకుంటే ఖాతా నిర్వహణ సై బర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంద ని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పాతూరి వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘నమ్మకం’ కోసం స్నేహితురాళ్ల ఫొటోలు షేర్
సాక్షి, సిటీబ్యూరో: చాటింగ్ యాప్ స్ట్రేంజర్‌లో విశృంఖలత్వం రాజ్యమేలుతోంది. ఈ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన నగరానికి చెందిన ‘ఎక్స్’, ‘వై’ చాటింగ్ చేసుకున్నారు. తాను యువతినంటూ వై, ఎక్స్‌తో చెప్పాడు. అది నమ్మించడం కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న తన స్నేహితురాలైన ‘జెడ్’ ఫొటోలు షేర్ చేశారు. తన ఫొటోలు షేర్ అయిన విషయం ఎక్స్ ద్వారా తెలుసుకున్న జెడ్.. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు గురువారం ఎక్స్, వైలకు కౌన్సెలింగ్ ఇచ్చి తీవ్రంగా మందలించారు. కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన స్ట్రేంజర్ యాప్‌ను అనేక మంది తమ స్మార్ట్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆపై నాక్మే వాస్తేగా లాగిన్ అయి చాటింగ్స్ చేస్తున్నారు. ఇందులో చాట్ చేయడానికి ఒకరికి మరొకరు తెలిసి ఉండటం, పరిచయం అవసరం లేదు. దీంతో ఈ యాప్‌లో విశృంఖలత్వం వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన ఓ విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎక్స్‌కు స్ట్రేంజర్ ద్వారా విద్యార్థి అయిన వైతో పరిచయం ఏర్పడింది. తాను యువతినంటూ చెప్పుకొన్న వై.. ఎక్స్‌తో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేశాడు. ఓ దశలో ‘నీ ఫొటోలు పంపించు’మంటూ ఎక్స్ కోరడంతో ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. చివరకు క్లాస్మేట్ అయిన విద్యార్థిని ‘జెడ్’ ఇన్‌స్ట్రాగామ్ ఖాతా వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. అందులో నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసిన వై.. వాటిని ఎక్స్‌కు షేర్ చేస్తూ, అభ్యంతరకరమైన చాటింగ్ కొనసాగించాడు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న ఆ యువతి ‘జెడ్’ ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో ఉన్నాయి. ఓ దశలో వీటిని సంగ్రహించిన వై.. స్ట్రేంజర్ యాప్ ద్వారా ఎక్స్‌కు పంపించాడు. ఆ ఫొటోలో సదరు స్వచ్ఛంద సంస్థ పేరును చూసిన ఇతగాడు కొన్ని ప్రయత్నాలు చేసి జెడ్‌ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో తనతో చాటింగ్ చేస్తోంది ఆమె కాదని, ఫొటోలను వై దుర్వినియోగం చేసినట్లు గుర్తించి ఆమెకు సమాచారం ఇచ్చాడు. దీంతో జెడ్ ఈ నెల 17న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలు విజ్ఞప్తి మేరకు అధికారులు సాంకేతికంగా వైని కనిపెట్టారు. గురువారం బాధితురాలితో పాటు ఎక్స్, వైలను సైబర్ ఠాణాకు తీసుకువచ్చారు. వారి భవిష్యత్, కుటుంబ నేపథ్యాలను దృష్టిలో పెట్టుకున్న బాధితురాలు తదుపరి చర్యలు వద్దని, కౌన్సెలింగ్‌తో పాటు వార్నింగ్ ఇచ్చి బైండోవర్ చేయమని కోరారు. దీంతో అధికారులు ఇద్దరినీ మందలించడంతో పాటు పునరావృతం కాదంటూ లిఖితపూర్వకంగా హామీ తీసుకుని పంపారు. మహిళలు, యువతులు సోషల్‌మీడియాలో తమ వ్యక్తిగత ఫొటోలు పెడితే ఇలా దుర్వినియోగం అవుతుందని, కొన్నిసార్లు అసభ్యంగా మార్ఫింగ్‌కు గురవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. విద్యార్థులు సైతం ఇలాంటి యాప్స్‌లో పడి తమ భవిష్యత్తును కాలరాసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా యాప్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచాలని నిర్ణయించారు. -
బస్టాప్‌ను అడ్డాగా చేసుకుని అమ్మాయిలను..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్‌లో అమ్మాయిలను కను సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ఆకతాయి. ప్రతిరోజు అమ్మాయిలను తన వెంట రమ్మని వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పేట్‌బషీరాబాద్ డివిజన్ షీ టీమ్ బృందం సభ్యులు ఆ ఆకతాయిని సోమవారం వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతల్ షా థియేటర్ సమీపంలో ఉన్న బస్టాప్‌లో గత కొంత కాలంగా భగత్‌సింగ్ నగర్‌కు చెందిన బాలాజీ అశోక్ గరిబీ(26) బస్టాప్‌లో నిలబడే మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై పలువురు షీ టీమ్స్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ నతానియల్కు ఫిర్యాదు చేశారు. దీంతో పేట్‌బషీరాబాద్ డివిజన్ షీ టీమ్స్ ఏఎస్సై శ్రీనివాస్‌కు సదరు ఫిర్యాదును పరిశీలించమని ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాప్‌లో షీ టీమ్ బృందం మాటు వేశారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్వయంగా గమనించారు. అశోక్ గరిజీని అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పిఎస్‌కు అప్పగించారు. -
హంతకుడు ఎవరు?
గోవాలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య చేసిందెవరు? హంతకుణ్ణి పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథతో రూపొందుతోన్న సినిమా ‘స్ట్రేంజర్’. ఫణికుమార్ అద్దేపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శివ హరీశ్, సమీర్ హీరోలు. దివా ఆలియా, తేజారెడ్డి హీరోయిన్లు. ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, కథనాలు ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి గోవాలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: అశ్విన్–ప్రేమ్‌చంద్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్. -
'స్ట్రేంజర్' మూవీ స్టిల్స్
-
మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
తొర్రూరు : మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని పత్తేపురం గ్రామశివారులో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ శ్రీధర్‌రావు కథనం ప్రకారం.. పత్తేపురం గ్రామానికి చెందిన కాయిత యాకమ్మ గ్రామశివారులో ఉన్న మామిడితోటలో పశువులను మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లాడు. మామిడితోటకు మందు పిచీకారి చేసేందుకు వచ్చానని ఆమెతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల రూ.60 వేల విలువ చేసే బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు యాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పిల్లలను మభ్యపెట్టి.. నగలు దోచేశాడు
కాజీపేట : ఒంటరిగా ఉన్న పిల్లలను మాయమాటలతో మభ్యపెట్టి దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కాజీపేట పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు గుండారపు జైపాల్‌రెడ్డి కాజీపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్‌నగర్ కాలనీలో నివసించే జైపాల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో టీచర్‌గా, ఆయన భార్య ఉషారాణి సైదాపూర్ మండలంలో వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఆకాశ్‌రెడ్డి, జాన్‌రెడ్డి ప్రశాంత్‌నగర్ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. రోజులాగే జైపాల్‌రెడ్డి దంపతులు మంగళవారం కూడా ఉద్యోగ విధులకు వెళ్లారు. అయితే మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో వీరి ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉండే మరో మిత్రుడు రుషికుమార్ను పిలుచుకొని కంప్యూటర్లో గేమ్స్ ఆడసాగారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఓ అపరిచిత వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. ‘మీ నాన్నగారు పంపించారు. బీరువాలో ఉన్న బంగారు నగల్ని మరమ్మతు చేయమన్నారు’ అంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తి పిల్లలకు చెప్పాడు. ఆ మాయమాటలను నమ్మిన చిన్నారులు బీరువాలో వెతికినా బంగారం కనిపించలేదు. దీంతో కంగుతిన్న గుర్తు తెలియని వ్యక్తి.. నేనిప్పుడే మీ నాన్నగారితో మాట్లాడుతానంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ‘బీరువాలో తెగిపోయిన బంగారు గొలుసు ఉందని మీ నాన్నగారు చెప్పారు’ అంటూ మళ్లీ నమ్మబలికాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైపాల్‌రెడ్డి చిన్న కుమారుడు జాన్‌రెడ్డి బీరువా పైభాగంలో నగలు ఉంటాయని చెప్పేశాడు. పిల్లలంతా కలిసి కుర్చీ ఎక్కి మరీ బీరువాలోని బంగారు గాజులు, నల్ల పూసల తాడు, రెండు జతల చెవి కమ్మలు, పిల్లల గొలుసులు, బ్రాస్లెట్ తీసి ఆ అపరిచితుడి చేతికి ఇచ్చేశారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కాజీపేట పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
మిర్చి లారీని ఎత్తుకెళ్లిన దుండగులు
గుంటూరు(సత్తెనపల్లి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది, లారీని తీసుకెళ్లారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
తిరుమల నడకదారిలో భక్తుల పై ఉన్నాది దాడి