మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని పత్తేపురం గ్రామశివారులో మంగళవారం సాయంత్రం జరిగింది.
మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
Aug 10 2016 12:14 AM | Updated on Sep 4 2017 8:34 AM
తొర్రూరు : మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని పత్తేపురం గ్రామశివారులో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ శ్రీధర్‌రావు కథనం ప్రకారం.. పత్తేపురం గ్రామానికి చెందిన కాయిత యాకమ్మ గ్రామశివారులో ఉన్న మామిడితోటలో పశువులను మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లాడు. మామిడితోటకు మందు పిచీకారి చేసేందుకు వచ్చానని ఆమెతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల రూ.60 వేల విలువ చేసే బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు యాకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement